barricades
-
రోడ్డుకు రెండు దిక్కులా బారికేడ్లు ఎందుకు?
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చుట్టూ తిరిగి వెళ్లాలి.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. వందల వాహనాలు వెనక్కి ఇటీవల పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్సేన్ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. -
కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్‌కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్‌డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
ప్రగతి భవన్ వద్ద కంచెలు తొలగింపు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను కొత్త ప్రభుత్వం తొలగించినట్లయ్యింది. సుమారు పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికిన తొలగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలను విధించగా.. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వాటిని ముందుగా తొలగించేందుకు పూనుకుంది. -
Video: రైతుల సంఘీభావం.. బారికేడ్లపైకి ఎక్కి, పక్కకు లాగేసి విరగ్గొట్టి..
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చాలా రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లకు రైతులు సోమవారం సంఘీభావం తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ 23 నుంచి వాళ్లు ఆందోళన చేస్తుండటం తెలిసిందే. సోమవారం ఉదయం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి వందలాదిగా రైతులు కాలినడకన జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి, వాటిని పక్కకు లాగేసి విరగ్గొట్టారు. వేదిక వద్దకు చేరి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. ‘పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. బీజేపీ నేతలు బ్రిజ్ భూషణ్‌కు అండగా ఉన్నారు. బాధిత రెజ్లర్ల తరఫున పోరాటం కొనసాగిస్తాం’అని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు. చదవండి: Manipur Violence: సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రెజ్లర్ల వద్దకు వెళ్లే హడావుడిలో రైతులు బారికేడ్లను ధ్వంసం చేశారన్నారు. ఇది మినహా మరే ఇతర అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. పోలీసులు అడ్డుపడ్డారంటూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అసత్యాలని తెలిపారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. -
రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..
జంతర్‌మంతర్ వద్ద భారత రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన రైతు సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున వారి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద నాటకీయ పరిణామాం చోటు చేసుకుంది. నిజానికి రైతులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిసి ముందస్తుగా భారీగా పోలీసుల మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు కూడా. ఐతే సోమవారం రైతులు, పోలీసులు మధ్య ముఖాముఖి చర్చలనంతరం వారి ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున తరలివంచిన రైతు సముహాలు జంతర్‌మంతర్ ఎంట్రీ వద్ద ఉన్న బారీకేడ్లను తోసుకుంటూ ఒకేసారి సమూహాంగా ప్రవేశించారు. దీంతో అక్కడ ఉన్న బారికేడ్లు పడిపోయాయి. అందువల్ల రైతులు కొందరూ వాటిపైకి ఎక్కి వెళ్లడం, మరికొందరూ కింద నుంచి వెళ్లడం వంటివి చేశారు. అంతేగాదు పోలీసుల బృందం వారి ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు బారికేడ్లను పక్కకు తొలగించినట్లు ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రజలను నకిలీ వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భద్రత నిర్ధారిచడానికి డీఎఫ్ఎండీ ద్వారా ప్రవేశాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని, చట్టానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం నిరసన వేదిక ముందు పెద్ద సంఖ్యలో రైతులు కూర్చున్నారు. ఇదిలా ఉండగా..వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..తమ నిరసనను ఎవరూ భగ్నం చేయలేరని నొక్కి చెప్పారు. మే 21లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్టు చేయకుంటే తమ నిరసనను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా దేశంలో అగ్రశ్రేణి రెజ్లర్లంతా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద పక్షం రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేసిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాల సదరు రెజ్లర్లకు తమ మద్దతను ప్రకటించి, వారి నిరసనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. #WATCH | Farmers break through police barricades as they join protesting wrestlers at Jantar Mantar, Delhi The wrestlers are demanding action against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over allegations of sexual harassment. pic.twitter.com/k4d0FRANws — ANI (@ANI) May 8, 2023 (చదవండి: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి) -
లండన్ ఘటనకు భారత్ కౌంటర్
ఢిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలీస్తానీ మద్దతుదారుల దుశ్చర్యకుగానూ.. భారత్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని యూకే హైకమిషన్ బయట ఉన్న బారికేడ్లను బుధవారం తొలగించింది. తద్వారా యూకే తీరుకు గట్టి బదులు ఇచ్చింది. ఖలీస్తానీ-పాక్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా.. ఖలీస్తానీ గ్రూప్‌నకు చెందిన కొందరు లండన్‌లోని భారత హై కమిషన్ వద్ద మువన్నెల జెండాను కిందకి దించేసి.. ఖలీస్తానీ జెండా ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భారత హైకమిషన్ అధికారులు తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది. అయితే.. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసులు, అధికారులు స్పందించలేదు. సకాలంలో స్పందించకపోవడం మాట అటుంచి.. భారత హైకమిషన్‌కు తగినంత భద్రత కల్పించకపోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బారికేడ్లను తొలగించింది. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ దేశ రాయబారిని వివరణ కోరుతూ భారత విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది కూడా. ఇక అక్కడి అధికార యంత్రాంగం, మంత్రులు మాత్రం.. ఖలీస్తానీ మద్దతుదారుల చర్యలను హేయనీయమైన చర్యగా పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ఝండా ఊంచా రహే హమారా -
రణరంగంగా అమృత్సర్! బారికేడ్లు తోసుకుని
ఛండీగఢ్: చారిత్రక నగరం అమృత్సర్.. ఇవాళ(గురువారం) రణరంగాన్ని తలపించింది. వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఓ మతబోధకుడి వ్యక్తిగత అనుచరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. మద్దతుదారులు బారికేడ్లు తొలగించి మరీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. భారీగా బల ప్రదర్శనతో అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్. ఆయన ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్‌ను ఖండిస్తూ గ్రూప్‌కు చెందిన వందలాది మంది మద్దతుదారులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆరోపించాడు. ఒక్క గంటలో కేసును వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించాడు. తామేమీ చేయలేమని అధికారులు, పోలీసులు భావిస్తున్నారిన, కానీ, తామేంటో చూపించేందుకే ఈ బలప్రదర్శన చేపట్టినట్లు చెప్పాడు. మరోవైపు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. #WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO — ANI (@ANI) February 23, 2023 -
Hyderabad: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్ కంట్రల్ సెంటర్ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ అమలు హిమాయత్‌నగర్: సీబీఆర్టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్ సిటీస్‌లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్‌లో సీబీఆర్టీ ఎగ్జామ్ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్) -
చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం! రష్యా బలగాలకు అడ్డుగా..
Build Barricades To Stop Russian Invasion: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నిరవధికంగా సాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అతలాకుతలమై పోయింది. అంతేగాక ప్రధాన నగరాలను ఒక్కొకటిగా రష్యా బలగాలు మోహరించడమే కాక కైవసం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరమైన ఒడెస్సాలో రష్యా దాడి చేయనుందంటూ తరుచుగా సైరన్లు మోగుతున్నాయి. దీంతో ఆ నగరంలోని సిటీ సెంటర్‌ను అడ్డుకునేందుకు స్థానికులు ఇసుకుతో బారికేడ్లను నిర్మించేందుకు ఉపక్రమించారు. ఆ బారికేడ్ నిర్మాణం పనుల్లో పదకొండేళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ చిన్నారులు తమ నగరంలో రష్యా దళాలు ప్రవేశించనివ్వమని, నిర్మాణం సజావుగా సాగుతోందని చెబుతున్నారు. అయితే ఓడరేవు నగరం ఖేర్సన్ను రష్యా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మైకోలైవ్ నగర కేంద్ర నుంచి రష్యా దళాలు ప్రవేశించకుండా స్థానిక వేటగాళ్లు నిలువరించడమే కాకుండా సఫలమయ్యారు కూడా. ఈ మేరకు ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లోని ప్రజలు తమ పోరాటంతో కొంత మేర విజయాన్ని సాధించాయనే చెప్పాలి. రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 750 మందికి పైగా పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ను విడిచిపెట్టారు కూడా. (చదవండి: పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్ స్కీ) -
టిక్రిలో రాకపోకల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు వేదికైన టిక్రిలో పోలీసులు బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ–రోహ్తక్ హైవే మీద ఉన్న టిక్రిలో పనులు శనివారానికి పూర్తయ్యాయి. రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య చర్చలు జరిగిన తర్వాత అక్కడ మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ‘‘రైతు సంఘాల నాయకులతో చర్చించాం. హరియాణాకు వెళ్లే మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఆ మార్గంలో రాకపోకలు మొదలయ్యాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పర్వీందర్ చెప్పారు. రైతు సంఘం నాయకులు కొన్ని సమయాల్లో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని అంటున్నారని, తాము మాత్రం 24 గంటలు ట్రాఫిక్ తిరిగేలా రహదారిని పునరుద్ధరించామని చెప్పారు. ఆ రోడ్డుపై చిన్న వాహనాలు రాకపోకలు సాగించవచ్చునని సింగ్ వివరించారు. టిక్రి రహదారిపై రాకపోకల్ని పునరుద్ధరించడంతో ఢిల్లీ నుంచి హరియాణా మీదుగా రాజస్థాన్‌కు వెళ్లేవారికి ప్రయాణం సులభతరంగా మారుతుంది. మరోవైపు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీదనున్న ఘజియాపూర్లో బారికేడ్లు, వైరింగ్లను తొలగించినప్పటికీ సిమెంట్ బారికేడ్లు, తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సి ఉంది. అది పూర్తయితే ఆ మార్గంలో కూడా రాకపోకలకు అనుమతిస్తామని పర్వీందర్ తెలిపారు. రైతులకు నిరసనలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నిరవధికంగా రహదారుల్ని మూసివేయకూడదంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రాంతాల్లో బారికేడ్లను ఎత్తివేస్తున్నారు. తమ పోరాటాన్ని ఇకపై ఎలా కొనసాగించాలో వ్యూహరచన చేస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు. -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్‌లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్‌కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్‌పూర్‌లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
రోడ్లపై భారీగా బారికేడ్లు
-
హాంకాంగ్ ఆందోళనలు తీవ్రతరం
హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్‌ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు నేడు సమ్మెకు పిలుపునివ్వగా ప్రజలంతా నల్ల రంగు దుస్తులు ధరించాలని వివిధ సంఘాలు కోరాయి. కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మంగళవారం నుంచి 70వ అవతరణ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో అలజడులు కొనసాగుతుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జాతీయ దినోత్సవాల్లో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లనున్నట్లు హాంకాంగ్ పాలకురాలు లామ్ ప్రకటించారు. నేర చరితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు నాలుగు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటన్ నుంచి చైనా ప్రధాన భూభాగంలో కలిసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2047 వరకు హాంకాంగ్‌లో వారికి స్వతంత్ర న్యాయవ్యవస్థ, వాక్ స్వాతంత్య్రం హక్కు కల్పించారు. అయితే, చైనా ప్రభుత్వం ఇప్పటికే వాటిని దూరం చేసిందని హాంకాంగ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బార్ ముందు బారికేడ్లు..!
జనం రద్దీని తట్టుకునేందుకుసినిమా హాళ్లు, బస్సు, రైల్వే స్టేషన్లలో టిక్కెట్టు క్యూ కౌంటర్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు మద్యం దుకాణాలు వారు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రద్దీ సమయాల్లో మందుబాబుల తోపులాటను నివారించే ముందు జాగ్రత్త చర్య ఇది. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ మద్యం దుకాణం ముందు ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. -
హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన రాజ్‌భవన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించిన సచివాలయాల భవనాల మధ్య బారికేడ్ల ఏర్పాటు గవర్నర్ ఆదేశాల మేరకే జరిగిందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రాజభవన్ వర్గాలు ఖండించాయి. గవర్నర్‌కు బారికేడ్ల ఏర్పాటుకు అసలు సంబంధమే లేదని రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్టపతి పాలన సమయంలో రెండు సచివాలయాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది. సచివాలయంలో ఇరు రాష్ట్రాల భవనాల మధ్య బారికేడ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాబు ఆరోపణలను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయ భవనాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసింది తాము కాదని....కంచె ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. దాంతో హరీష్ రావు వ్యాఖ్యలపై గురువారం రాజభవన్ స్పందించింది. -
సచివాలయంలో కంచె!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవనాల మధ్య బారికేడ్లు.. సీఆర్పీఎఫ్ పహారా చిచ్చుపెట్టేయత్నమంటూ ఉద్యోగ సంఘాలు ధ్వజం హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఉమ్మడిగా ఉన్న సచివాలయంలో కొత్తగా కంచెపడింది. ఇక నుంచి ఒక రాష్ట్రం ఉద్యోగులు, అధికారులు మరో రాష్ట్రం సచివాలయ భవనాల్లోకి వచ్చే వీల్లేదు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన భవనాల మధ్య బారికేడ్లను ఏర్పాటు చేసిన అధికారులు, సాయుధులైన కేంద్ర రిజర్వుడు పోలీసు బలగాలను బారికేడ్ల వద్ద ఏర్పాటు చేశారు. పాలనా సౌలభ్యం కోసం సచివాలయంలోని భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించి, తెలంగాణ కోసం మింట్‌కంపౌండ్- ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్డులో ప్రత్యేక గేటును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సచివాలయంలోని ఏబీసీడీ బ్లాకులను తెలంగాణకు, జె,కె.ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకులను ఏపీకి కేటాయించారు. అయినా ఇప్పటి వరకు ఒక ప్రాంత ఉద్యోగులు మరో ప్రాంతంలోకి వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే ఇటీవల చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సచివాలయంలోకి వచ్చిన సందర్భంగా ఏపీ ఉద్యోగుల వాహనాలను తెలంగాణకు కేటాయించిన బ్లాక్‌ల దగ్గర పార్క్ చేశారు. తెలంగాణ బ్లాకులన్నీ కార్లు, ఇతర వాహనాలతో నిండిపోవడం..ఆంధ్రప్రదేశ్ సచివాలయం గేటు నుంచి తెలంగాణకు చెందిన ఉద్యోగులు వాహనాలతో వచ్చే అవకాశం లేకుండా చేయడం వంటి కారణాలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో బారికేడ్లు ఏర్పాటు చేయమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ సచివాలయ ప్రవేశద్వారం నుంచి పాత సచివాలయం గేటు వరకు బారికేడ్లు ఏర్పాటయ్యాయి. కాగా క్యాంటీన్లు, పోస్టాఫీసు, బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్రాంతంలో ఉండడంతో తెలంగాణ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే పోలీసు పహారా మధ్య ఎల్ బ్లాక్ వద్ద చిన్న దారిని వదిలారు. ఉద్యోగ సంఘాల నిరసన ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య కంచె ఏర్పాటు చే సి విభేదాలకు కారణమవుతున్నారని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధి రాజ్‌కుమార్ గుప్తా వేర్వేరుగా మీడియా సమావేశాల్లో విమర్శించారు. ముందస్తు సమచారం లేకుం డా బారికేడ్లు ఏర్పాటు బలగాలను మోహరించడం యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నదన్నారు. వెంటనే బారికేడ్లు తొలగించాలని కోరారు. -
రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు
-
రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు
హైదరాబాద్ : రాత్రికి రాత్రే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య బారికేడ్లు వెలిశాయి. దాంతో రెండు రాష్ట్రాల సచివాలయాలను మధ్య విభజన రేఖ ఏర్పడినట్లు అయ్యింది. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.