న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చాలా రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లకు రైతులు సోమవారం సంఘీభావం తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ 23 నుంచి వాళ్లు ఆందోళన చేస్తుండటం తెలిసిందే. సోమవారం ఉదయం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి వందలాదిగా రైతులు కాలినడకన జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు.
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి, వాటిని పక్కకు లాగేసి విరగ్గొట్టారు. వేదిక వద్దకు చేరి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. ‘పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. బీజేపీ నేతలు బ్రిజ్ భూషణ్‌కు అండగా ఉన్నారు. బాధిత రెజ్లర్ల తరఫున పోరాటం కొనసాగిస్తాం’అని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు.
చదవండి: Manipur Violence: సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రెజ్లర్ల వద్దకు వెళ్లే హడావుడిలో రైతులు బారికేడ్లను ధ్వంసం చేశారన్నారు. ఇది మినహా మరే ఇతర అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. పోలీసులు అడ్డుపడ్డారంటూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అసత్యాలని తెలిపారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment