జంతర్‌మంతర్ వద్ద భారత రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన రైతు సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున వారి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద నాటకీయ పరిణామాం చోటు చేసుకుంది. నిజానికి రైతులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిసి ముందస్తుగా భారీగా పోలీసుల మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు కూడా. ఐతే సోమవారం రైతులు, పోలీసులు మధ్య ముఖాముఖి చర్చలనంతరం వారి ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున తరలివంచిన రైతు సముహాలు జంతర్‌మంతర్ ఎంట్రీ వద్ద ఉన్న బారీకేడ్‌లను తోసుకుంటూ ఒకేసారి సమూహాంగా ప్రవేశించారు.
దీంతో అక్కడ ఉన్న బారికేడ్లు పడిపోయాయి. అందువల్ల రైతులు కొందరూ వాటిపైకి ఎక్కి వెళ్లడం, మరికొందరూ కింద నుంచి వెళ్లడం వంటివి చేశారు. అంతేగాదు పోలీసుల బృందం వారి ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు బారికేడ్లను పక్కకు తొలగించినట్లు ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రజలను నకిలీ వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
భద్రత నిర్ధారిచడానికి డీఎఫ్‌ఎండీ ద్వారా ప్రవేశాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని, చట్టానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం నిరసన వేదిక ముందు పెద్ద సంఖ్యలో రైతులు కూర్చున్నారు. ఇదిలా ఉండగా..వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..తమ నిరసనను ఎవరూ భగ్నం చేయలేరని నొక్కి చెప్పారు. మే 21లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్టు చేయకుంటే తమ నిరసనను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా దేశంలో అగ్రశ్రేణి రెజ్లర్లంతా డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద పక్షం రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేసిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాల సదరు రెజ్లర్లకు తమ మద్దతను ప్రకటించి, వారి నిరసనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
#WATCH | Farmers break through police barricades as they join protesting wrestlers at Jantar Mantar, Delhi
— ANI (@ANI) May 8, 2023
The wrestlers are demanding action against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over allegations of sexual harassment. pic.twitter.com/k4d0FRANws
(చదవండి: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి)
Comments
Please login to add a commentAdd a comment