ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించిన సచివాలయాల భవనాల మధ్య బారికేడ్ల ఏర్పాటు గవర్నర్ ఆదేశాల మేరకే జరిగిందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రాజభవన్ వర్గాలు ఖండించాయి. గవర్నర్కు బారికేడ్ల ఏర్పాటుకు అసలు సంబంధమే లేదని రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్టపతి పాలన సమయంలో రెండు సచివాలయాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది.
సచివాలయంలో ఇరు రాష్ట్రాల భవనాల మధ్య బారికేడ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాబు ఆరోపణలను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయ భవనాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసింది తాము కాదని....కంచె ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. దాంతో హరీష్ రావు వ్యాఖ్యలపై గురువారం రాజభవన్ స్పందించింది.
హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన రాజ్భవన్
Published Thu, Jul 3 2014 7:52 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement