
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి.
సమిష్టితత్వం, సమన్వయంతో పనిచచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయి. తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజాదరణకు నోచుకుని ప్రభుత్వాస్పత్రులు నేడు రద్దీగా మారాయి. మరింత నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అంటూ వ్యాఖ్యలు చేశారు.