
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదేశించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడానికి నిర్ణయించారు. (చదవండి: ‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’)
రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హుజూర్‌నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ!)