
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కోవిడ్‌పై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సూచనల దృష్యా వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత నెల 19న కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు కలిగిన ఆయన ఫాం హౌస్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. గత మంగళవారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం కోవిడ్ నెగిటివ్ అని తేల్చింది.
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,75,748కు చేరగా.. 2,579 మంది మరణించారు. ఇప్పటివరకు 3,96,042 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.