సాక్షి, అమరావతి : కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు విరాళాలు అందచేశాయి. తాజాగా వరుణ్ గ్రూప్ గురువారం సీఎం సహాయనిధికి రూ.2కోట్లు విరాళం ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిషోర్, ఎండీ వి.వరుణ్ దేవ్ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందచేశారు.
►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలు తరపున 1 కోటి 18 వేల 227 రూపాయలు విరాళమందించారు.
►నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ అందజేశారు.మెట్టిపల్లి రమేష్,దానారెడ్డి, ఎం.బి.వి.సత్యన్నారాయణ పాల్గొన్నారు.
►సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఈఓ వెంకట్ జాస్తి విరాళం చెక్‌ను అందజేశారు.
►విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం
►గుంటూరు రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం
►దొడ్ల డెయిరీ : రూ.25 లక్షలు విరాళం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును వైయస్.జగన్‌కు దొడ్ల డెయిరీ తరపున పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment