సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిరోధించి బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె. జవహర్‌రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘CHIEF MINISTER RELIEF FUND, ANDHRA PRADESH’ పేరున చెక్కులివ్వాన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌కు విరాళాలు పంపవచ్చన్నారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా apcmrf.ap.gov.inకు పంపవచ్చునని సూచించారు. దాతలు తమ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, ఈమేయిల్ అడ్రస్, విరాళాల ఉద్దేశం, చెక్కులు లేదా ఆన్‌లైన్ చెల్లింపు వంటి వివరాలను Special Officer to Hon'ble Chief Minister, Ground Floor, 1st Block, A.P. Secretariat, Velagapudi (e-mail: splofficer-cm@ap.gov.in) కు అందజేయాలి. విరాళాలందజేసిన దాతలు సీఎం కార్యాలయం నుంచి లేఖ, రసీదు, వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, ధృవపత్రం మొదలైన వాటిని apcmrf.ap.ov.inవెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.
విరాళాలు పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు:
ఖాతాపేరు : సీఎంఆర్‌ఎఫ్
SBI Ac/No - 38588079208
Velagapudi Secretariat Branch
IFSC Code: SBIN0018884
ఖాతాపేరు : సీఎంఆర్‌ఎఫ్
Andhra Bank Account No - 110310100029039..
Velagapudi Secretariat Branch,
IFSC Code: ANDB0003079
Comments
Please login to add a commentAdd a comment