బనగానపల్లె పర్యటనలో సీఎం జగన్‌ను కలసిన అభాగ్యులు
ఆపదలో ఉన్నామని ఆదుకోవాలని విన్నపం
పలువురికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారారూ. 16.30 లక్షల ఆర్థికసాయం
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయడానికి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆపదలో ఉన్నామని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మానవతా దృక్పథంతో వారికి ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులును సీఎం ఆదేశించారు. దీంతో వెంటనే కలెక్టర్ బాధితుల వివరాలు తెలుసుకుని 16 మందికి రూ.16.30 లక్షలను సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేశారు. –
సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వారి వివరాలు
► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన లక్కా కేశవ పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష అందజేశారు.
► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కె.మార్తమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► అవుకు మండలం సంగపట్నానికి చెందిన షేక్ షరీఫ్ ఫిజియో థెరపీ చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు.
► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన ఎస్.గణేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష అందజేశారు.
► అవుకు మండలం సింగనపల్లెకు చెందిన ఎ.తారకేశవ్ మాన సిక వికలత్వంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని గణేష్ బ్రెయిన్‌లో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితుని చికిత్స కోసం రూ. 50 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు.
► బనగానపల్లె మండలం గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన కంబగిరి స్వామి మెదడులో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఒద్దిరాళ్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడవ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతనికి చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► అనంతపురం పాతబస్తీకి చెందిన పి.ముష్కస్ బ్యాక్ బోన్ ఫ్యాక్చర్‌తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► రోడ్డు ప్రమాదంలో మోకాలు పోగొట్టుకున్న అనంతపురానికి చెందిన బాధితుడు ఎస్.ఖాజాకు రూ.50 వేల చెక్కును అందజేశారు.
► ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన సి.సోమశేఖర్ పేదరికం కారణంగా గృహ నిర్మా ణం నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు.
► ప్రకాశం జిల్లా ఓబులంపల్లికి చెందిన బాల గురువయ్య వైద్య ఖర్చుల కోసం అతని భార్యకు రూ.లక్ష చెక్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment