
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం రూ. 8.72 కోట్ల విరాళం అందింది. పలువురు దాతలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. సమాజం ఆపదలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చిన సంస్థలు, దాతలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ లేబొరేటరీస్ రూ. 5 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విర్చో పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున విరాళం అందజేశాయి. ఐఆర్‌ఏ రియల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సుచిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చాయి. ఎంజీబీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మానవీయ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ. 20 లక్షలు చొప్పున అందజేశాయి. మాధవరం కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సింథోకెమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓషన్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్స్, మిరియాల చిన్న రాఘవరావు రూ.10 లక్ష లు చొప్పున సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. వీరితోపాటు మహేశ్వరి మైనింగ్ అండ్ ఎనర్జీ రూ.5 లక్షలు, నిఖిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ. 2 లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment