సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ. 75,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే. రామమోహన్ రావు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అందజేశారు. చదవండి: భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగానే ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రూ. 50,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ని ముఖ్యమంత్రి కార్యాలయంలో హోం మంత్రి సుచరిత సమక్షంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రామచంద్రా రెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణుప్రసాద్, ఎంవీ రావు, ఎంఎస్‌ఎన్ రెడ్డి, విజయ్ విరాళం చెక్కును అందజేశారు. చదవండి: సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం
Comments
Please login to add a commentAdd a comment