
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు అందుతున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. రిలయన్స్ జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ఆర్‌ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి శుక్రవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. విరాళం అందజేసినందుకు మంత్రి కేటీఆర్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి, ప్రతినిధి కేసీ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పీఎం కేర్స్‌కు రిలయన్స్ రూ. 530 కోట్ల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.
(ఏపీలో మొత్తం 133 రెడ్ జోన్లు)