Reliance Industries Limited
-
ముకేశ్ అంబానీకి సెబీ జరిమానా సరికాదు
న్యూఢిల్లీ: రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్లలో అవకతవకల ట్రేడింగ్ వివాదం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్– శాట్ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్‌లో దాఖలైన అప్పీల్లో 87 పేజీల ఈ తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ జనవరి 2021 కీలక రూలింగ్ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్ వద్ద జరిమానాను డిపాజిట్ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్ఐఎల్కు లభించని ఊరట.. అయితే ఈ కేసు విషయంలో ఆర్ఐఎల్ వేసిన అప్పీల్‌ను శాట్ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ తరుణ్ అగర్వాలా, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరా స్వరూప్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, ‘కంపెనీ ఆర్ఐఎల్కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది. నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్ఐఎల్తో ఆర్పీఎల్ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్ఐఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అయితే కంపెనీ (ఆర్ఐఎల్) నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. నగదు, ఎఫ్అండ్ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్పీఎల్ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్ఐఎల్ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది పీఎఫ్‌యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ముకేశ్ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్ బెంచ్ అభిప్రాయపడింది. -
రిలయన్స్ గ్యాస్ వేలం నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ తమ తూర్పు ఆఫ్‌షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్‌లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్‌ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది. డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది. -
UAE T20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే
UAE's International League T20: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టి20 లీగ్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 6న టోర్నీ ప్రారంభమై ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 6 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన సంస్థలే 5 టీమ్‌లను కొనుగోలు చేయడం విశేషం. ఐపీఎల్ టీమ్‌లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్‌రైడర్స్ గ్రూప్, జీఎంఆర్ మూడు జట్లను ఎంచుకోగా... అదానీ స్పోర్ట్స్‌లైన్, క్యాప్రీ గ్లోబల్ కూడా భారతీయ కంపెనీలే. మరో టీమ్‌ను మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన లాన్సర్ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది. ఇప్పటికే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అను భవం ఉన్న యూఏఈ బోర్డు తమ సొంత లీగ్‌ను కూడా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉంది. చదవండి: World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత -
తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), బీపీ జాయింట్ వెంచర్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బిఎంఎల్) నేడు నవీ ముంబైలో తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ జియో-బీపీ బ్రాండ్ కింద ఇంధన స్టేషన్లను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 1,400 ఇంధన నెట్‌వర్క్‌ను జియో-బీపీగా రీబ్రాండ్ చేస్తామని ప్రకటించింది. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ ఇంధనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లను పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించాము. కస్టమర్ సౌకర్యానికి అనుగుణంగా వినియోగదారులకు ఇవి కోసం అనేక సేవలు అందిస్తాయి. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్స్ ఉంటాయి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన 'యాక్టివ్' టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కీలకమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది అని కంపెనీ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవి ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ!) -
13 సంవత్సరాల క్రితం ఆరోపణలు, రిలయన్స్‌కు ఊరట
న్యూఢిల్లీ: షేర్‌పై వచ్చే ఆర్జన (ఈపీఎస్– ఎర్నింగ్స్ పర్ షేర్) విషయంలో 13 సంవత్సరాల క్రితం ఆర్థిక ఫలితాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై దాఖలైన ఆరోపణలను ‘ఎటువంటి జరిమానా విధించకుండా’ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొట్టివేసింది. దీనికి రెండు అంశాలను సెబీ ప్రాతిపదికగా తీసుకుంది. అందులో ఒకటి... ఒక లిస్టెడ్ కంపెనీ ఫలితాల్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తున్న చట్ట సవరణ 2019 మార్చి నుంచీ అమల్లోకి వచ్చింది. ఇక సెబీ పేర్కొన్న రెండవ అంశం (గ్రౌండ్) విషయానికి వస్తే... ఈ తరహా వివాదం, ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అప్పీలేట్ (శాట్) ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. షేర్ వారెంట్స్ జారీ జరిగినప్పటికీ, 2007 జూన్ నుంచి 2008 సెప్టెంబర్ వరకూ త్రైమాసిక ఫలితాల స్టేట్మెంట్లు ఈపీఎస్‌ను ఒకే విధంగా కొనసాగించాయన్నది ఆర్‌ఐఎల్‌పై ప్రధాన ఆరోపణ. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
అంబానీ సెకను సంపాదన.. సామాన్యుడికి ఎన్నేళ్లంటే!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోయాయి. సామాన్యులు పూట గడిచేందుకు అష్టకష్టాలు పడుతుండగా.. కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఎగిసింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ దేశాన్ని ముట్టడించిన నాటి నుంచి దేశీయంగా 100 మంది టాప్ బిలియనీర్ల సంపద విలువ సుమారు రూ. 12,97,822 కోట్ల మేర పెరిగింది. ఈ మొత్తాన్ని కటిక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న 13.8 కోట్ల మంది పేదలకు పంచితే .. వారికి తలా ఓ రూ. 94,045 లభిస్తుంది. కరోనా కష్టకాలాన్ని విశ్లేషిస్తూ.. ’అసమానత వైరస్’ పేరిట ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలోని భారత్ అనుబంధంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సామాన్యులు, సంపన్నుల మధ్య అసమానతల గురించి వివరించేందుకు.. ప్రపంచంలోనే టాప్ సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద, ఆదాయాలను ఆక్స్‌ఫామ్ పరిగణనలోకి తీసుకుంది. అంబానీ ఒక్క గంటలో ఆర్జించే ఆదాయాన్ని నైపుణ్యాలు లేని కార్మికుడు సంపాదించాలంటే ఏకంగా 10,000 సంవత్సరాలు పడుతుందని లెక్క వేసింది. ఇక అంబానీ సెకనులో ఆర్జించే ఆదాయాన్ని సంపాదించాలన్నా కనీసం మూడేళ్లు పడుతుందని పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. తీవ్రమైన అసమానతలను పరిష్కరించేందుకు సత్వరం చర్యలు తీసుకోకపోతే.. సంక్షోభం ముదిరే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. మహామాంద్యానికి సమాన సంక్షోభం.. గడిచిన వందేళ్లలో ఇలాంటి ప్రజారోగ్య సంబంధ సంక్షోభం ఈ స్థాయిలో తలెత్తడం ఇదే ప్రథమమని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. 1930లో తలెత్తిన మహామాంద్యంతో సరిపోల్చతగిన స్థాయి ఆర్థిక సంక్షోభానికి ఇది దారి తీసిందని తెలిపింది. మహమ్మారి కారణంగా తమ తమ దేశాల్లో ఆదాయ అసమానతలు భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో 87% మంది ఆర్థిక వేత్తలు అభి ప్రాయపడినట్లు వివరించింది. ఈ ఆక్స్‌ఫామ్ సర్వేలో 79 దేశాలకు చెందిన జెఫ్రీ శాక్స్, జయతి ఘోష్, గాబ్రియల్ జక్మన్ వంటి 295 మందికి పైగా దిగ్గజ ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. ప్రతి గంటకూ 1.70 లక్షల ఉద్యోగాలు కట్.. కరోనా సంక్షోభ సమయంలో సంపన్నుల సంపద మరింతగా పెరగ్గా పేదలు మరింత పేదరికంలోకి జారిపోయారు. లాక్డౌన్ అమలు చేసిన 2020 మార్చి నాటి నుంచి బొగ్గు, ఐటీ, ఆయిల్, టెలికం, ఫార్మా, విద్య, రిటైల్ తదితర రంగాలకు చెందిన కుబేరులు గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సైరస్ పూనావాలా, ఉదయ్ కోటక్, అజీం ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, రాధాకిషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్ వంటి వారి సంపద అనేక రెట్లు పెరిగింది. అయితే, 2020 ఏప్రిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆ నెలలో ప్రతీ గంటకూ 1,70,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది. నివేదిక ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. లాక్డౌన్ పూర్వ స్థాయితో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగిత 15 శాతం పెరిగింది. మహమ్మారి తీవ్రంగా ఉన్న కాలంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వీరిలో సింహభాగం (75 శాతం మంది) 9.2 కోట్ల మంది అసంఘటిత రంగానికి చెందినవారేనని ఆక్స్‌ఫామ్ వివరించింది. ఆరోగ్యానికి అత్యంత తక్కువ కేటాయింపులు.. ‘ఆరోగ్యానికి ప్రభుత్వాలు చేసే కేటాయింపులు చూస్తే అత్యంత తక్కువ కేటాయింపులతో భారత్ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంటుంది. కరోనా మహమ్మారి కాలంలో పెరిగిన టాప్ 11 దేశీ కుబేరుల సంపదపై కనీసం ఒక్క శాతం పన్ను విధించినా.. జన ఔషధి పథకానికి కేటాయింపులు 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది. తద్వారా పేదలు, బడుగు వర్గాలకు చౌకగా ఔషధాలు అందించవచ్చు‘ అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పదేళ్ల పాటు లేదా ఆరోగ్య శాఖను పదేళ్ల పాటు నడిపించేందుకు సరిపోతుందని వివరించింది. ‘డేటా ప్రకారం మహమ్మారి కాలంలో అంబానీ ఆర్జించిన ఆదాయం ... దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కనీసం 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు కరోనా కారణంగా కటిక పేదరికంలోకి జారిపోకుండా దాదాపు అయిదు నెలల పాటు ఆదుకోవడానికి సరిపోతుంది‘ అని పేర్కొంది. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త రికార్డు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్ షేరుకు డిమాండ్ పెరిగింది. నేటి ఉదయం బీఎస్ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.1787.50)తో పోలిస్తే రూ.1828.25 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1833.10లు, రూ.1833.10గా నమోదయ్యాయి. జియోలోకి 12వ పెట్టుబడి: రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్ 0.39శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. -
ఆర్ఐఎల్లో 12ఏళ్ల గరిష్టానికి ముకేశ్ వాటా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వాటా 12ఏళ్ల గరిష్ట స్థాయి 49.14శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్ఐల్ జారీ చేసిన రైట్స్ ఇష్యూలో భాగంగా ముకేశ్ కొన్ని షేర్లను సొంతం చేసుకోవడంతో కంపెనీలో వాటా పెరిగింది. ఆర్ఐఎల్కు చెందిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో ముకేశ్ అంబానీ, ఇతర ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కలిపి రూ.28,286 కోట్లు వెచ్చించి 2.25 కోట్ల షేర్లను దక్కించుకున్నారు. కంపెనీలో జూన్ 2008 నాటికి ప్రమోటర్ల వాటా 51.37 శాతంగా ఉండేది. అది 2011 సెప్టెంబర్ నాటికి 44.71శాతానికి దిగివచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వివిధ రూపాల్లో క్రమంగా కంపెనీలో వాటాలను పెంచుకుంటున్నారు. రైట్స్ ఇష్యూలో భాగంగా అన్సబ్స్క్రైబ్డ్ పోర్షన్లో ప్రమోటర్ గ్రూప్ దాదాపు 50శాతం అదనపు వాటాను సొంతం చేసుకున్నట్లు రెగ్యూలేటరీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఒక ప్రమోటర్ తన కంపెనీలో వాటాను పెంచుకోవడం, భారీ ఎత్తున నిధులను సమీకరించడటం లాంటి అంశాలు సంస్థ భవిష్యత్తు వృద్ధిపై ప్రమోటర్ నిబద్ధతను చాటి చెబుతాయి. అలాగే ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దియో అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24న సూచీలు ఏడాది కనిష్టాన్ని తాకిన నాటి నుంచి శుక్రవారం వరకు రిలయన్స్ షేరు 82శాతం లాభపడింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.07లక్షల కోట్లుగా ఉంది. గురువారం ఆర్ఐల్ పాక్షిక పెయిడ్-అప్ రైట్స్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు: రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతా అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు అందుతున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. రిలయన్స్ జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి శుక్రవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. విరాళం అందజేసినందుకు మంత్రి కేటీఆర్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి, ప్రతినిధి కేసీ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పీఎం కేర్స్‌కు రిలయన్స్ రూ. 530 కోట్ల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. (ఏపీలో మొత్తం 133 రెడ్ జోన్లు) -
రూ.3,000 కోట్లు సమీకరించిన ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించి నట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్ సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఆర్ఐఎల్ తెలిపింది. 2028 నవంబర్ 9న ఇవి గడువు తీరుతాయని పేర్కొం ది. ఇంధనం, పెట్రోకెమికల్, రిటైల్, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో రిలయన్స్ 30 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిం ది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో బలపడేందుకు గాను హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు గత నెలలో ఒప్పందాలు కూడా చేసుకుంది. -
కేజీ-డీ6లో మళ్లీ తగ్గిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో రోజుకు 13.63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు పెరిగిన ఉత్పత్తి ఈ నెలలో 13.28 ఎంసీఎండీలకు తగ్గింది. చమురు శాఖకు సమర్పించిన స్థాయీ నివేదికలో నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరిలో తొలివారంలో కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాలతో పాటు ఎంఏ చమురు క్షేత్రం నుంచి 13.58 ఎంసీఎండీల గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసింది. ఆతర్వాత వారంలో ఇది 13.68 ఎంసీఎండీలకు పెరిగింది. అయితే, ఈ నెల 9తో ముగిసిన వారంలో గ్యాస్ ఉత్పత్తి 13.28 ఎంసీఎండీలకు తగ్గిందని డీజీహెచ్ తెలిపింది. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.17 ఎంసీఎండీలు, ఎంఏ చమురు క్షేత్రం నుంచి 5.11 ఎంసీఎండీల ఉత్పత్తి నమోదైంది. ఇంకా సగానికిపైగా బావుల మూత... అంతకంతకూ పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి పెంచే ప్రణాళికలో భాగంగా ఆర్ఐఎల్ జనవరిలో ఎంఏ చమురు క్షేత్రంలోని ఎంఏ-8 బావిలో మళ్లీ గ్యాస్ వెలికితీతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉత్పత్తి గత నెలలో 1.5 ఎంసీఎండీలు పెరిగి 5.33 ఎంసీఎండీలకు చేరింది. మూడేళ్లపాటు వరుస తగ్గుదలకు బ్రేక్‌పడింది. అయితే, మళ్లీ తాజాగా ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్కు 60 శాతం, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు 30 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పటిదాకా డీ1, డీ3 క్షేత్రాల్లో 22 బావులను తవ్విన ఆర్ఐఎల్ కేవలం 18 బావుల్లోనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం 8 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోందని, 10 బావులు మూతబడేఉన్నాయని డీజీహెచ్ తాజా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఎంఏ క్షేత్రాల్లో మొత్తం 7 బావులకుగాను 5 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఒక బావి(ఎంఏ-6హెచ్)లో మరమ్మతులు చేపడుతోందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2009 ఏప్రిల్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 2010 మార్చిలో గరిష్టంగా 69.43 ఎంసీఎంసీలను తాకింది. ఇప్పుడు 80 శాతం పైనే ఉత్పత్తి దిగజారినట్లు లెక్క. కాగా, వచ్చే నెల 1 నుంచి గ్యాస్ రేటు రెట్టింపు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 8 డాలర్లకు ఎగబాకనుంది. ధర పెరిగాక అనూహ్యంగా లాభాలు దండుకోవడగానికే రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌ను దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.