
UAE's International League T20: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టి20 లీగ్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 6న టోర్నీ ప్రారంభమై ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 6 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన సంస్థలే 5 టీమ్‌లను కొనుగోలు చేయడం విశేషం.
ఐపీఎల్ టీమ్‌లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్‌రైడర్స్ గ్రూప్, జీఎంఆర్ మూడు జట్లను ఎంచుకోగా... అదానీ స్పోర్ట్స్‌లైన్, క్యాప్రీ గ్లోబల్ కూడా భారతీయ కంపెనీలే. మరో టీమ్‌ను మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన లాన్సర్ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది. ఇప్పటికే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అను భవం ఉన్న యూఏఈ బోర్డు తమ సొంత లీగ్‌ను కూడా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉంది.
చదవండి: World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత