
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ కొత్తగా ప్రారంభించిన టి20 లీగ్‌లో కేకేఆర్ సహా యజమాని షారుక్ ఖాన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై షారుక్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. షారుక్‌తో పాటు ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కూడా టి20 లీగ్‌లో జట్ల కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతోపాటు నాలుగుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్‌కే మొదట్లో ఆసక్తి కనబరిచినా.. తాజాగా పక్కకు తప్పుకున్నట్లు తెలిసింది.
చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని
బిగ్‌బాష్ లీగ్ జట్టు సిడ్నీ సిక్సర్స్ కూడా కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఇక ఆగస్టులో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రీమియర్ లీగ్ టి20 పేరిట క్రికెట్ లీగ్‌ను రిజిస్టర్ చేసింది. దీనికి యూఏఈ జాతీయ చిహ్నం అయిన ఫాల్కన్‌ను సింబల్‌గా లోగోను తయారు చేసింది. ప్రతీ ఏడాది జనవరి- ఫిబ్రవరి నెలలో టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండనున్నాయి.
చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు
Comments
Please login to add a commentAdd a comment