ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), బీపీ జాయింట్ వెంచర్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బిఎంఎల్) నేడు నవీ ముంబైలో తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ జియో-బీపీ బ్రాండ్ కింద ఇంధన స్టేషన్లను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 1,400 ఇంధన నెట్‌వర్క్‌ను జియో-బీపీగా రీబ్రాండ్ చేస్తామని ప్రకటించింది. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ ఇంధనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లను పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించాము. కస్టమర్ సౌకర్యానికి అనుగుణంగా వినియోగదారులకు ఇవి కోసం అనేక సేవలు అందిస్తాయి. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్స్ ఉంటాయి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన 'యాక్టివ్' టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కీలకమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది అని కంపెనీ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవి ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment