
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించి నట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్ సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఆర్‌ఐఎల్ తెలిపింది.
2028 నవంబర్ 9న ఇవి గడువు తీరుతాయని పేర్కొం ది. ఇంధనం, పెట్రోకెమికల్, రిటైల్, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో రిలయన్స్ 30 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిం ది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో బలపడేందుకు గాను హాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు గత నెలలో ఒప్పందాలు కూడా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment