
తమిళనాడు: ఓ వృద్ధుడు భిక్షాటన ద్వారా వచ్చిన రూ.10 వేలును మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చాడు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం తూత్తుకుడి జిల్లా సాత్తాంగుళం తాలూకా అలంగినారు ప్రాంతానికి చెందిన భూల్ పాండియన్ (73) వచ్చాడు.
తన భిక్షాటన ద్వారా తనకు వచ్చిన రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని కలెక్టర్ కార్యాలయ అధికారుల వద్దకు వెళ్లాడు. తరువాత వాటిని బ్యాంకుల ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి జమ చేయమని సూచించారు. దీంతో బ్యాంకుకు వెళ్లి తన పొదుపు సొమ్ము రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment