
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీఎం కరోనా నివారణ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందించారు. అనంతరం వడివేలు మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రపంచాన్నే విస్మయ పరచారని పేర్కొన్నారు. పరిపాలనలో ఆయన తండ్రి పేరును నిలబెట్టుకున్నారని అన్నారు.
కొంగునాడు విభజనపై జరుగుతున్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఇప్పుడు కొంగునాడు అంటూ విభజననే ఊహించలేం అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయరాదని వడివేలు అన్నారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వడివేలు ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment