
చెన్నై: కరోనా నివారణకు విరాళాలు ఇవ్వాలన్న సీఎం విజ్ఞప్తికి బాగా స్పందన వస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత, శ్రీ గోకులం చిట్‌ఫండ్ అండ్ ఫైనాన్స్ అధినేత గోపాలన్ రూ.కోటి విరాళంగా అందించారు. ఆయన గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఆయన వెంట చిట్‌ఫండ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైజూ గోకుల్, డైరెక్టర్ ఆపరేషన్స్ ప్రవీణ్ ఉన్నారు.