CM Mk Stalin Appreciated Maamannan Movie Makers Team, Deets Inside - Sakshi
Sakshi News home page

మామన్నన్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు

Published Fri, Jun 30 2023 9:07 AM | Last Updated on Fri, Jun 30 2023 10:18 AM

Cm Mk Stalin Appreciate To Maamannan Movie Makers Team - Sakshi

కోలీవుడ్‌లో 'మామన్నన్‌' సినిమా జూన్‌ 29న విడుదలైంది. ఈ చిత్రంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రశంసలు కురిపించారు. ఉదయనిది స్టాలిన్‌ కథానాయకుడిగా నటించి రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. నటి కీర్తిసురేష్‌ నాయకిగా నటించిన ఇందులో వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. పరియేరుమ్‌ పెరుమాళ్‌, కర్ణన్‌ చిత్రాల ఫేమ్‌ మారిసెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌-ఉపాసన కూతురి పేరు ఫైనల్‌ చేసేశారు)

కాగా చిత్రంపై నటుడు కమలహాసన్‌, ధనుష్‌ వంటి ప్రముఖులు చిత్రాన్ని చూసి ఎంతగానో ప్రశంసిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. మామన్నన్‌ చిత్రాన్ని గురువారం ఉదయం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్లో ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీని గురించి చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్‌ ట్విటర్‌లో పేర్కొంటూ మామన్నన్‌ చిత్రాన్ని చూసిన ముఖ్యమంత్రి చాలా బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మామన్నన్‌ చిత్రాన్ని ప్రశంసించిన కమలహాసన్‌, ధనుష్‌లను ఉదయనిధి స్టాలిన్‌ ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

(ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement