
వర్ష బీభత్సం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి. హైదరాబాద్‌ని మళ్లీ మామూలుగా మార్చేందుకు మనందరం సహాయంగా నిలబడదాం అని స్టార్స్ అనుకున్నారు. సీయం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ కోటిన్నర, చిరంజీవి కోటి, మహేశ్ బాబు కోటి, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు, నిర్మాత యస్. రాధాకృష్ణ 10 లక్షలు ప్రకటించారు. బుధవారం పవన్ కల్యాణ్ 1 కోటి, దర్శకులు ఎన్. శంకర్ 10 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు ప్రకటించారు.