contributions
-
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్‌ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది. -
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
తోడుగా ఉందాం
వర్ష బీభత్సం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి. హైదరాబాద్‌ని మళ్లీ మామూలుగా మార్చేందుకు మనందరం సహాయంగా నిలబడదాం అని స్టార్స్ అనుకున్నారు. సీయం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ కోటిన్నర, చిరంజీవి కోటి, మహేశ్ బాబు కోటి, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు, నిర్మాత యస్. రాధాకృష్ణ 10 లక్షలు ప్రకటించారు. బుధవారం పవన్ కల్యాణ్ 1 కోటి, దర్శకులు ఎన్. శంకర్ 10 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు ప్రకటించారు. -
జాతీయ పార్టీలకు రూ.622.38 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు రూ.20 వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు వచ్చిన విరాళాల వివరాలు ఇందులో పేర్కొంది. అన్నిజాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 విరాళాలు అందగా, వాటి విలువ రూ. 622.38 కోట్లు. ఈ రేసులో సహజంగానే అధికార బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి రూ. 437.35 కోట్ల విరాళాలు వచ్చాయి. గత పదేళ్లుగా బీఎస్పీకి వస్తున్న విరాళాలను వెల్లడిస్తున్నా, ఈ ఆర్థిక సంవత్సరానికి తమకు రూ. 20 వేల పైన విరాళాలు ఏవీ అందలేదని ఆ పార్టీ తెలిపింది. జాతీయ పార్టీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలు పార్టీలు విరాళాల సంఖ్య రూ. కోట్లలో బీజేపీ 1234 437.35 కాంగ్రెస్ 280 141.46 ఎన్సీపీ 52 38.82 సీపీఎం 74 3.42 సీపీఐ 55 1.33 2013-14 ఆర్థిక సంవత్సరంతో 2014-15 ఆర్థిక సంవత్సరం పోల్చితే అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. పార్టీలు 2013-14 2014-15 బీజేపీ 170.86 437.35 ఐఎన్‌సీ 59.58 141.46 ఎన్సీపీ 14.02 38.82 సీపీఎం 2.09 3.42 సీపీఐ 1.22 1.33 రెండు పార్టీలకూ ఆ కంపెనీల విరాళాలు కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇస్తాయి. బీజేపీకి సత్యా ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 107.25 కోట్లు, జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 63.02 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 54.01 కోట్లను, సత్యా ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 18.75 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. -
వైఎస్సాఆర్సీపీకి స్వచ్చందంగా విరాళాలు