న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది.
2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్‌ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్‌సీఆర్‌ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది.
Comments
Please login to add a commentAdd a comment