సీఎంకు నివారణ నిధి చెక్కును అందజేస్తున్న శివకుమార్ కుటుంబ సభ్యులు
సాక్షి, చెన్నై: కరోనా నివారణ నిధికి సీనియర్ నటుడు శివకుమార్ కుటుంబం రూ.కోటి విరాళంగా అందించింది. రాష్ట్రంలోని ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేమి నెలకొన్న నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధిని సేకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమాలకు ముందుండే నటుడు శివ కుమార్ కుటుంబం సీఎం విజ్ఞప్తికి స్పందించి రూ. కోటి విలువైన చెక్కును సీఎం స్టాలిన్‌కు అందించారు. శివకుమార్ ఆయన కొడుకులైన నటులు సూర్య, కార్తీ హాజరై కరోనాపై పోరులో తమ మద్దతును ప్రభుత్వానికి తెలియజేశారు.
#ActorSivakumar @Suriya_offl @Karthi_Offl handed over the Cheque for 1Cr to Hon’ble Chief Minister @mkstalin #TNCMReliefFund @rajsekarpandian pic.twitter.com/sKZ6U52LsJ
— BARaju (@baraju_SuperHit) May 12, 2021
Comments
Please login to add a commentAdd a comment