సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశ దేశాలై స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనాపై యుద్ధం కోసం చాలామంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రీటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు దోచిన సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తన ఏడాది జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బుధవారం ట్వీట్ చేశారు.
‘ఇప్పుడు మనం చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి కరోనా మహమ్మారితో పోరాడాలి. వ్యక్తిగతంగా, నేను నా ఏడాది జీతాన్ని ముఖ్యమంత్రి సహాయకనిధికి ఇస్తున్నాను. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. మీకు తోచిన సహయం చేయమని అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు కరోనా రక్కసి కన్నడనాట నిరంతరాయంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య వందకు దగ్గరగా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒక్క మంగళవారమే కొత్తగా 13 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించగా, మరో ఆరుమంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment