
డార్లింగ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. రీసెంట్‌గా కేరళలోని వయనాడ్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి-రామ్ చరణ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్ చేరారు.
(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్ట చంపారు)
కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి రూ.కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ మెచ్చుకుంటున్నారు.
దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. అయితే తెలుగు నుంచి ఇప్పటివరకు బన్నీ, చిరు-చరణ్, ప్రభాస్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఎంతో కొంత విరాళమిస్తే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.
(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి)
Comments
Please login to add a commentAdd a comment