వయనాడ్‌ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం | Gautam Adani Contributes Rs 5 Crore to Kerala CM Relief Fund | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ ఘటన: రూ.5 కోట్లు ప్రకటించిన గౌతమ్ అదానీ

Published Thu, Aug 1 2024 1:49 PM | Last Updated on Thu, Aug 1 2024 2:50 PM

Gautam Adani Contributes Rs 5 Crore to Kerala CM Relief Fund

వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.

వయనాడ్‌ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్‌లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.

వయనాడ్‌ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement