
సంగారెడ్డి అర్బన్: కరోనా బాధితులకు తన వంతు సహాయంగా చిన్నారి పెద్ద మనస్సుతో కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.3,826 సీఎం సహాయ నిధికి అందజేసింది. ఆదివారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్‌రావును సంగారెడ్డికి చెందిన సాయినాథ్, స్వాతి దంపతుల కూతురు శ్రీముఖి కలిశారు. 11 నెలలుగా తాను దాచుకున్న డబ్బులను అందజేయడంతో చిన్నారి ఔదార్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.
కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శం
కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బసవేశ్వర 887వ జయంతి సందర్భంగా జిల్లా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పం పిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని తెలిపారు. కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 74 లక్షల మందికి రూ.1500 చొప్పున అందజేసినట్లు తెలిపారు. అకౌంట్లు లేని 6 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు అందచేస్తామని హరీశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment