దేశంలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్య జనం నుంచి సినీ రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. రోజుకు వేలల్లో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. అక్కడ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండటంతో సామాన్య ప్రజలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వానికి తోడుగా సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
ఇందుకోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. తాజా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ‘చీఫ్ మినిస్టర్స్ డిస్‌స్ట్రెస్ రీలీఫ్ ఫండ్ కేరళ’(సీఎండీఆర్‌ఎఫ్‌కే)కు తన వంతు సాయంగా విరాళం అందించారు. అనుపమ విరాళం ఇచ్చినట్లుగా సీఎండీఆర్‌ఎఫ్‌కే సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్‌లో అనుపమ షేర్ చేస్తూ అందరిని విరాళం ఇవ్వాల్సిందిగా పిలుపు నిచ్చారు. ‘నా వంతు విధిని నిర్వర్తించాను.. ప్లీజ్ మీరు కూడా కాస్తా సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Have done my part... pls contribute that little you can !!! https://t.co/aExMt4W5h4 pic.twitter.com/BzuM87TliO
— Anupama Parameswaran (@anupamahere) April 25, 2021
Comments
Please login to add a commentAdd a comment