రాంకీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ తరపున సీఎం కేసీఆర్‌కు రూ.5 కోట్ల చెక్కును అందచేస్తున్న గౌతమ్‌రెడ్డి, ఆళ్ల శరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న కార్యక్రమాల కోసం తమవంతు సాయంగా ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. రాంకీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎమ్.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. సైంట్ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, సీఈఓ బి.కృష్ణా సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. రాజా ధనరాజ్‌గిర్ ఎస్టేట్స్ చైర్మన్ అరుణ్ మహేందర్ గిర్ కోటి రూపాయల చెక్కును సీఎంకు విరాళంగా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment