ramky group
-
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
-
రామ్కీ ఇన్ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 15వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి..ప్రభావం, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమంగా నడుస్తున్న సంస్థ తదితర విభాగాల్లో ఈ అవార్డులు దక్కినట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణ రంగంలో తాము పాటించే అత్యుత్తమ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్. నాగరాజ తెలిపారు. ప్లానింగ్ కమిషన్ (ప్రస్తుతం నీతి ఆయోగ్), భారతీయ నిర్మాణ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించింది. -
రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ ఎస్టేట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ. 2,000 కోట్ల విలువ చేసే బుకింగ్స్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఇది సుమారు రూ. 1,200 కోట్లుగా ఉంది. అలాగే వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించడంపై సంస్థ దృష్టి పెడుతోంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్కీ ఎస్టేట్స్ ఎండీ ఎం నంద కిషోర్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల పైచిలుకు విలువ చేసే 27 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంతో దాదాపు రూ. 10,000 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు వివరించారు. (మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు) కొత్తగా మరో రూ. 3,600 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ‘కమ్యూనిటీ లివింగ్’ కాన్సెప్ట్‌కు పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, వచ్చే 3-4 ఏళ్లలో వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు నంద కిషోర్ చెప్పారు. తొలుత 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయ న్నారు. వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావంతో సంబంధం లేకుండా నివాస గృహాలకు డిమాండ్ ఎప్పు డూ ఉంటుందని తెలిపారు. సంస్థ దగ్గర దాదాపు రూ.6,500 కోట్ల విలువ చేసే 1,000 ఎకరాల స్థలం ఉన్నట్లు డైరెక్టర్ తారక రాజేశ్ దాసరి చెప్పారు. (కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!) రామ్‌కీవర్స్ ఆవిష్కరణ..: ప్రాపర్టీ కొనుగోళ్లకు సంబంధించి కస్టమర్లు ఎంపిక చేసుకునే ప్రక్రియ ను సులభతరం చేసేలా రామ్కీ ఎస్టేట్స్ అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది. ‘రామ్‌కీవర్స్’ను ఆవిష్కరించింది. దీనితో ప్రాజెక్టును చూసేందుకు, వివరాలు తెలుసుకునేందుకు కస్టమర్లు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా, సౌకర్యంగా ఇంటి దగ్గర్నుంచే వర్చువల్ టూర్ చేయొచ్చని .. సేల్స్ సిబ్బందితో కూడా మాట్లాడవచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు తెలిపారు. -
సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న కార్యక్రమాల కోసం తమవంతు సాయంగా ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. రాంకీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎమ్.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. సైంట్ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, సీఈఓ బి.కృష్ణా సీఎంఆర్ఎఫ్కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. రాజా ధనరాజ్‌గిర్ ఎస్టేట్స్ చైర్మన్ అరుణ్ మహేందర్ గిర్ కోటి రూపాయల చెక్కును సీఎంకు విరాళంగా ఇచ్చారు. -
రాంకీ నుంచి 4 ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో 3, చెన్నైలో 1 సరికొత్త ప్రాజెక్ట్‌తో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. నల్లగండ్లలో ఇప్పటికే రాంకీ వన్ గెలాక్సియా ప్రాజెక్ట్‌ను నిర్మించిన రాంకీ.. తాజాగా ఫేజ్–2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. జీ+14 అంతస్తుల నిర్మాణంలో 2 బ్లాక్స్‌లో మొత్తం 412 యూనిట్లుంటాయి. 1265 నుంచి 1665 చ.అ. విస్తీర్ణాల్లో 2, 3 బీహెచ్‌కే గృహాలను నిర్మిస్తుంది. మహేశ్వరంలోని రాంకీ డిస్కవరీ సిటీలో ది హడ్లీ పేరిట క్లస్టర్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. 9.98 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 125 విల్లాలుంటాయి. విస్తీర్ణాలు 174 నుంచి 402 గజాల్లో ఉంటాయి. ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. ఇదే ప్రాంతంలో 3.81 ఎకరాల్లో గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 200 ఫ్లాట్లు. 1130 నుంచి 2060 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.46 లక్షలు. చెన్నైలోని కలీకుప్పంలో 1.31 ఎకరాల్లో లెమన్గ్రాజ్ (ఆర్డబ్ల్యూడీ) ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 129 గృహాలు. 1047 నుంచి 1498 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే గృహాలుంటాయి. రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో 80 లక్షల చ.అ.ల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించింది. వీటిల్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, హై, మిడ్, లో రైజ్ అపార్ట్మెంట్లు, కాంటెంపరరీ వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లున్నాయి. ప్రస్తుతం కోటి చ.అ.ల్లో పలు నివాస ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. 20 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభ దశలో ఉండగా.. మరొక 1.8 కోట్ల చ.అ.లో ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. -
కేకేఆర్ చేతికి రామ్కీ ఎన్విరో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్) అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు ఇరు కంపెనీల ప్రతినిధులూ ప్రకటించారు. రామ్కీ ఎన్విరోలో ప్రైమరీ, సెకండరీ పెట్టుబడులు కలిపి రూ.3,630 కోట్లను కేకేఆర్ ఇన్వెస్ట్ చేసింది. గ్లోబల్ ఇంపాక్ట్ స్ట్రాటజీలో భాగంగా కేకేఆర్ ఏసియన్ ఫండ్–3 నుంచి ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు కేకేఆర్ ఎండీ రూపేన్ ఝవేరీ తెలియజేశారు. సామాజికంగా, పర్యావరణ పరంగా ప్రభావాన్ని చూపించగలిగే వ్యాపారాలను గుర్తించడం, పెట్టుబడులు పెట్టడం కోసం గ్లోబల్ ఇంపాక్ట్ స్ట్రాటజీని ఏర్పాటు చేశామని ఝవేరీ చెప్పారు. ప్రపంచంలోనే వ్యర్థాల నిర్వహణ అవసరం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని... ఈ విషయంలో దేశవ్యాప్తంగా పరిష్కారాలను, సేవలను అందిస్తూ రామ్కీ కీలక పాత్ర పోషిస్తున్నదని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ, సీఈఓ ఎం.గౌతమ్ రెడ్డి చెప్పారు. పర్యావరణ సవాళ్లకు ప్రభావశీలమైన పరిష్కారాలను అందించడంలో, సానుకూల మార్పు తీసుకురావాలనే భావ సారూప్యత కారణంగా కేకేఆర్ సంస్థ తమకు మంచి భాగస్వామి కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో దేశంలోనే ఇది అతిపెద్ద డీల్ అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
రామ్కీ ఎన్విరో విదేశీ టూర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్థాల నిర్వహణలో ఉన్న దిగ్గజ సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్... విదేశీ మార్కెట్లలో మరింత విస్తరిస్తోంది. అమెరికా, ఒమన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, సింగపూర్, బంగ్లాదేశ్‌లో ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాల్లోనూ విస్తరణకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో మూడింట ఒక వంతు అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. 2022 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి చెప్పారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వాణిజ్యపరంగా అనుకూలమైన ప్రపంచస్థాయి పరిష్కారాలను తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. పెట్టుబడి రూ.1,000 కోట్లు.. ఒమన్‌లో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, సౌదీ అరేబియాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంటు నిర్మాణం, దుబాయ్‌లో నిర్మాణ వ్యర్థాల రికవరీ ఫెసిలిటీ ఏర్పాటుకు రామ్కీ ఎన్విరో ఇటీవలే అంతర్జాతీయ కాంట్రాక్టులను దక్కించుకుంది. అలాగే పారిశ్రామిక, జీవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు దోహా, జోర్డాన్, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు పొందింది. వీటి నిర్మాణానికి వచ్చే రెండేళ్లలో రామ్కీ సంస్థ రూ.900–1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. మెరైన్ సర్వీసుల్లోకి.. ఇటీవలే టెక్సాస్‌కు చెందిన నేచుర్ ఎన్విరాన్మెంటల్, మెరైన్ సర్వీసెస్‌లో 50 శాతం వాటాను రామ్కీ ఎన్విరో కొనుగోలు చేసింది. తద్వారా సముద్ర వ్యర్థాల నిర్వహణలోకి ప్రవేశించిన భారత కంపెనీగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల్లో 10 కంపెనీలే ఉన్నాయని గౌతమ్ రెడ్డి తెలిపారు. ‘‘నేచుర్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఏటా రూ.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భారత్‌తో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని సేవలను అందుబాటులోకి తెస్తాం’’ అని వివరించారు. అయిదేళ్లలో 50 శాతం.. రామ్కీ ఎన్విరో సంస్థ 2016–17లో రూ.1,550 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,800 కోట్లు ఉండొచ్చని గౌతమ్ రెడ్డి చెప్పారు. ‘‘దీన్లో విదేశీ వ్యాపారం వాటా రూ.600 కోట్లు ఉంటుంది. రెండేల్లో మొత్తం టర్నోవర్ రూ.3,500 కోట్లకు చేరే అవకాశముంది. దీన్లో విదేశీ వాటా 30 శాతం ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం వాటా ఐదేళ్లలో 50 శాతానికి చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు. వ్యర్థాల నుంచి విద్యుత్.. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో కంపెనీకి మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుంది. రోజుకు సుమారు 6,000 టన్నుల వ్యర్థాలు ఈ కేంద్రానికి వస్తాయి. ఇక్కడే వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల ప్లాంటు నిర్మాణంలో ఉంది. 2019 మార్చికల్లా విద్యుత్ ప్లాంటు అందుబాటులోకి రానుంది. రామ్కీ ఎన్విరో దీనికోసం రూ.340 కోట్లు వెచ్చిస్తోంది. ఇక జవహర్‌నగర్ డంప్ యార్డులో క్యాపింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. క్యాపింగ్ పూర్తయితే పరిసరాల కాలుష్యానికి చెక్ పడుతుంది. -
‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు
మూడు రోడ్డు ప్రాజెక్టులు విక్రయానికి సిద్ధం రాంకీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి వెల్లడి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సివిల్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ రంగాల్లో నిమగ్నమైన రాంకీ గ్రూప్ గల్ఫ్ దేశాల్లో మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది. పర్యావరణ, వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ఓమన్, సౌదీ అరేబియా దేశాల్లో రూ. 200 కోట్లతో ప్రాజెక్టులను చేపడుతున్నామని రాంకీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న అయోధ్య రామిరెడ్డి గురువారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ...ఓమన్‌లో ఖింజీ రామ్‌దాస్ సంస్థతో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ కోసం ఇందాద్‌తో కలసి మరో ప్రాజెక్టు చేస్తున్నామన్నారు. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో అట్కో గ్రూప్‌తో కలసి ఇంకో ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. తాజా పెట్టుబడులతో గల్ఫ్ దేశాల్లో తమకు మరింత పట్టు పెరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తుది దశలో రోడ్డు ప్రాజెక్టుల విక్రయం? రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్యాష్ ఫ్లో లోటు సమస్య నుండి బయటపడేందుకు నామ్ ఎక్స్‌ప్రెస్‌వే, సెహోర్ కోస్మి, రాంకీ ఎస్లామిక్స్ హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాజెక్టులను విక్రయానికి పెట్టామని, సరైన కొనుగోలుదారు దొరికితే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రాజెక్టుల విక్రయం ద్వారా రూ వెయ్యి కోట్లు ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థకు రూ. 1,400 కోట్ల రుణాలున్నాయని, వీటిని తీర్చేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఒక నెలలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అజయ్ పిరమల్ గ్రూప్ ఈ ప్రాజెక్టులను చేజిక్కించుకునే రేస్‌లో మొదటి స్థానంలో ఉందన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డిని ఇదే విషయమై ప్రశ్నించగా, ప్రస్తుతం తామేమీ వ్యాఖ్యానించలేమన్నారు. ‘‘రోడ్డు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించి పలు సంస్థలతో సంప్రదిస్తున్నాం. కొన్ని సంస్థలతో నాన్ డిస్క్లోజర్ ఒప్పందాలు చేసుకున్నాం. మేం సంప్రదిస్తున్న కంపెనీల్లో సింగపూర్‌కు చెందిన కన్సార్షియంతో పాటు కొన్ని ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.