హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్‌కీ ఎస్టేట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ. 2,000 కోట్ల విలువ చేసే బుకింగ్స్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఇది సుమారు రూ. 1,200 కోట్లుగా ఉంది. అలాగే వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించడంపై సంస్థ దృష్టి పెడుతోంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌కీ ఎస్టేట్స్ ఎండీ ఎం నంద కిషోర్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల పైచిలుకు విలువ చేసే 27 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంతో దాదాపు రూ. 10,000 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు వివరించారు. (మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు)
కొత్తగా మరో రూ. 3,600 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ‘కమ్యూనిటీ లివింగ్’ కాన్సెప్ట్‌కు పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు వివరించారు.
మరోవైపు, వచ్చే 3-4 ఏళ్లలో వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు నంద కిషోర్ చెప్పారు. తొలుత 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయ న్నారు. వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావంతో సంబంధం లేకుండా నివాస గృహాలకు డిమాండ్ ఎప్పు డూ ఉంటుందని తెలిపారు. సంస్థ దగ్గర దాదాపు రూ.6,500 కోట్ల విలువ చేసే 1,000 ఎకరాల స్థలం ఉన్నట్లు డైరెక్టర్ తారక రాజేశ్ దాసరి చెప్పారు. (కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!)
రామ్‌కీవర్స్ ఆవిష్కరణ..: ప్రాపర్టీ కొనుగోళ్లకు సంబంధించి కస్టమర్లు ఎంపిక చేసుకునే ప్రక్రియ ను సులభతరం చేసేలా రామ్‌కీ ఎస్టేట్స్ అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది. ‘రామ్‌కీవర్స్’ను ఆవిష్కరించింది. దీనితో ప్రాజెక్టును చూసేందుకు, వివరాలు తెలుసుకునేందుకు కస్టమర్లు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా, సౌకర్యంగా ఇంటి దగ్గర్నుంచే వర్చువల్ టూర్ చేయొచ్చని .. సేల్స్ సిబ్బందితో కూడా మాట్లాడవచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment