
సాక్షి, అమరావతి : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్ ట్రస్ట్ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కాగా, రాష్ట్రలో గురువారం ఉదయం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కి చేరాయి.
(చదవండి: సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ)
Comments
Please login to add a commentAdd a comment