వైవీయూ, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఫలితాల్లో కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి 26వ ర్యాంకు సాధించాడు. రామాపురం మండలం నల్లగుట్టపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడికోట బాలకృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఈయన విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే సాగింది.
పాథమిక విద్య రామాపురంలోను, హైస్కూల్ కడప నాగార్జునలోను, ఇంజినీరింగ్ కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలో పూర్తిచేసిన అనంతరం గేట్‌లో జాతీయస్థాయిలో 38వ ర్యాంకు సాధించి ముంబయ్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశాడు. అనంతరం టాటాటెక్నాలజీస్ కంపెనీలో సీఏఈ అనలిస్టుగా పనిచేశాడు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రజలకు సేవచేయాలని తరచూ చెప్పే మాటలు ఆయన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి.
చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌బాట పట్టాడు. అక్కడ ఒకటిరెండు సార్లు ఒటమి ఎదురైనా కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చిన స్ఫూర్తితో యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలిప్రయత్నంలోనే దేశంలోనే 26వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటాడు. ఐఏఎస్ సాధనకు మరోసారి సివిల్స్ రాసి మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ఎంతో సంతోషాన్నిస్తోందని పవన్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు.
ప‘వన’ విజేత
Published Fri, Jan 31 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement