UPSC Civil Services Preliminary Examination
-
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ► మొత్తం పోస్టుల సంఖ్య: 861 ► అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: 01.08.2022 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేది: 05.06.2022 ► వెబ్సైట్: upsc.gov.in -
యూపీఎస్సీ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తిరిగి మరోమారు యూపీఎస్సీ అధికారులు సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కూడా వాయిదా పడినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్సైట్ చూడాల్సిందిగా సూచించారు. -
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
మచిలీపట్నం : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు శిక్షణ పొందేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ఎం.చినబాబు గురువారం తెలిపారు. నవంబరు 5వ తేదీలోగా ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాలని చెప్పారు. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించకుండా ఉండాలని, డిగ్రీ విద్యార్హతతో పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా కోర్సు చదువుతున్నా, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా ఉచిత శిక్షణకు అనర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం నవంబరు 16న కామన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, ఇక్కడ అర్హత పొందిన అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి శిక్షణ ఇస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను http://apbcwelfare.cgg.gov.in లోనమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఫోన్ నం: 0866-433008లో సంప్రదించాలన్నారు. -
నేటి సివిల్స్ పరీక్షకు సర్వం సిద్ధం
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్ష కోసం నగరంలో మొత్తం 83 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అంధ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సైఫాబాద్‌లోని యూనివర్సిటీ సైన్స్ కళాశాలను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ షీట్లో వివరాలను నింపడంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే ఇన్విజిలేటర్ల సహకారం తీసుకోవచ్చు. నగరంలో ఆదివారం జరగనున్న సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 240 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా జరగనున్న పరీక్షలకు అనుగుణంగా బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు. ఈ బస్సులకు ‘సివిల్స్ స్పెషల్’ అనే బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్, ఉప్పల్, రామకృష్ణాపురం, కోఠి, శిల్పారామం, ఎల్బీనగర్, మిధాని తదితర మార్గాల్లో, ఈసీఐఎల్ నుంచి అఫ్జల్‌గంజ్, జీడిమెట్ల-కోఠి, మెహదీపట్నం-చార్మినార్, గోల్కొండ-చార్మినార్, కాచిగూడ-అపురూపకాలనీ, హిమాయత్‌సాగర్-కోఠి, ఉప్పల్-మెహదీపట్నం, ఎల్బీనగర్-మెహదీపట్నం, దిల్సుఖ్నగర్-పటాన్చెరు తదితర మార్గాల్లో ఈ బస్సులు నడుస్తాయి. వివరాలు ఇలా.. పరీక్షా కేంద్రాలు: 83 మొత్తం అభ్యర్థులు: 38,798 అంధ అభ్యర్థులు: 146 జోనల్ అధికారులు: 44 సూపర్వైజర్లు: 44 ఇన్విజిలేటర్లు: 2,250 పరీక్ష సమయం.. పేపర్-1 ఉ.9.30- మ.12.30 పేపర్-2 మ.2.30-సా.4.30 ప్రత్యేక బస్సులు: 240