
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు ఆగలేదు. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్‌తోపాటు ఎన్డీఏ పక్షం సభ్యులు తమ డిమాండ్లపై నిరసనలు తెలిపారు. దీంతో బడ్జెట్ మలి విడత సమావేశాల్లో ఆరో రోజూ ఎటువంటి కార్యకలాపాలు లేకుం డానే సభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్లకార్డులతో వెల్‌లోకి వచ్చి నినాదాలు చేపట్టారు. తెలంగాణకు రిజర్వేషన్ల కోటా కోసం టీఆర్‌ఎస్, కావేరి బోర్డు ఏర్పాటు కోరుతూ ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు.
దీంతో స్పీకర్ సభను 11 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాకా ఆందోళనలు కొనసాగాయి. ఇదే సమయంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శుక్లా ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లును ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో నినాదాలు చేస్తుండటంతో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభ స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల సభ్యులు నిరసనలు చేపట్టడం తో మధ్యాహ్నానికి వాయిదా పడింది.
తిరిగి సమావేశమయ్యాక వైఎస్సార్‌సీపీ, టీఎంసీ, ఆప్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజధాని ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయా లంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశా రు. తిరిగి సమావేశమయ్యాక నిరసనలు మధ్యనే గ్రామీణాభివృద్ధిపై పార్లమెంట రీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసుల అమలుపై తాగునీరు, పారిశుద్ధ్యం శాఖ సహాయ మంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా ఒక ప్రకటన చేశారు. ఆందోళనలు ఆగకపోవటంతో డిప్యూటీ స్పీకర్æసభను మంగళవారానికి వాయిదావేశారు.