భారతదేశంలో అమలు చేయబడిన ఎమర్జెన్సీ కాలం (1975 జూన్ 25–1977 మార్చి 21) నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్‌పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం దేశంలో జరగుతున్న ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. దాంతో కంగనా రనౌత్ రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment