
పరీక్ష పత్రం లీకేజీ ఆరోపణలతో నిర్ణయం
న్యూఢిల్లీ: సీఎస్‌ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని వివరించింది.
అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్‌ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే.