
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్, ప్రొటెమ్ చైర్మన్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి సోమవారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు.
అక్టోబర్ ఒకటో తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. భారీ వర్షాల నేపథ్యంలో తాము నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. దీంతో అధికార, విప క్ష నేతలను సంప్రదించిన అనంతరం సమావేశాల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
చదవండి:
తెలంగాణ: రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా