విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒSలో బుధవారం నుంచి ఈనెల 28వ తేదీవరకు రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టం (ఆర్‌ఆర్‌ఐ) పునరుద్ధరణ పనులు జరగనున్నాయి.
-
∙డోర్నకల్–విజయవాడ–కాజీపేట మార్గంలో పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు
-
∙ఎక్స్‌ప్రెస్‌లను దారిమళ్లించనున్న అధికారులు
డోర్నకల్ / రైల్వే గేట్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒSలో బుధవారం నుంచి ఈనెల 28వ తేదీవరకు రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టం (ఆర్‌ఆర్‌ఐ) పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. ఈ మేరకు డోర్నకల్ – విజయవాడ మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లతో పాటు మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దు కానున్న రైళ్లు, ఆయా తేదీల వివరాలిలా ఉన్నాయి. విజయవాడ – కొత్తగూడెం ప్యాసింజర్(57254) ఈనెల 21 నుండి 28 వరకు, కొత్తగూడెం – విజయవాడ ప్యాసింజర్(57253) 21 నుండి 28వ తేదీ వరకు, కాజీపేట–విజయవాడ పుష్‌పుల్(57237) 21 నుండి 26వ తేదీ వరకు, డోర్నకల్ – విజయవాడ వెళ్లే ప్యాసింజర్(67251) 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు, విజ యవాడ – కాజీపేటకు వెళ్లే పుష్‌పుల్ రైలు(57238) 21 నుండి 27వ తేదీ వరకు, విజయవాడ–మహబూబాబాద్ పెద్దపల్లి ప్యాసింజర్(77253) 21, 24, 28వ తేదీ ల్లో, మహబూబాబాద్–విజయవాడ పెద్దపల్లి ప్యాసింజర్(77254) 23, 27వ తేదీ ల్లో, విజయవాడ–డోర్నకల్ ప్యాసింజర్(67272) 21 నుండి 27వ తేదీ వరకు రద్దుకానుంది. అలాగే, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22, 23, 24 తేదీల్లో సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకే నడపనుండగా 25వ తేదీన పూర్తిగా రద్దు చేస్తా రు. ఇక ఇంటర్‌సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను నడికుడి మీదుగా, షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 20, 22, 25వ తేదీల్లో డోర్నకల్, ఖమ్మం మీదుగా రాయ¯ŒSపాడు బైపాస్ నుండి కాకినాడకు, కాకినాడ – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను 21, 24, 26వ తేదీల్లో రాయ¯ŒSపాడు బైపాస్ మీదు గా డోర్నకల్, వరంగల్ నుండి షిర్డీకి నడపనున్నారు.అలాగే, లింక్‌ఎక్స్‌ప్రెస్, మచి లీపట్నం, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను ఇదే మా ర్గంలో విజయవాడ స్టేష¯ŒSకు వెళ్లకుండా రాయ¯ŒSపాడు బైపాస్ మీదుగా నడపనున్నారు.
అంతేకాకుండాగోదావరిఎక్స్‌ప్రెస్, గౌతమి, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, ఏపీ, స్వర్ణజయంతి మొదలైన రైళ్లు విజయవాడ వర కు వెళ్లకుండా కొండపల్లి గుణదల రైల్వేస్టే ష¯ŒS నుంచి వైజాగ్ వెళ్లనున్నాయి. చైన్నై వైపు వెళ్లే రైళ్లు సంఘమిత్ర, గోరఖ్‌పూర్, గరీబ్‌రథ్, దర్బంగా, నవజీవ¯ŒS, గంగాకావేరి, జనతా, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు సంపర్క్‌క్రాంతి రైళ్లు వయా కాజీపేట నుం చి కాచిగూడ మీదుగా చెన్నై వైపు వెళ్తాయ ని అధికారులు చెప్పారు. ఇక కృష్ణా, ఇంటర్‌సిటీ రైళ్లు సికంద్రాబాద్ నుంచి నడికుడ మీదుగా గుంటూరు వైపు వెళతాయి.