from tomorrow
-
రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో లారీల సమ్మె
-
రేపటి నుంచి టోల్ ట్యాక్స్ పునరుద్ధరణ
-
బ్రహ్మాండ నాయకునికి.. బ్రహ్మోత్సవ శోభ
ద్వారకా తిరుమల :అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని చాటే.. బ్రహ్మోత్సవాలు చిన్న తిరుపతి క్షేత్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా, జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచినదిగా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తూ.. తరిస్తున్నారు. వైఖానస ఆగవూన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి తిరు కల్యాణ వుహోత్సవాలు వైభవోపేతంగా ఏటా రెండుసార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 11 నుంచి 18 వరకు జరిగే ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవ విశేషాలివీ.. ఉత్సవాలకు శ్రీకారం ఇలా.. ఈనెల 11న ఉదయం 10 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది. 12న సాయంత్రం 6 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై శ్రీవారి తిరువీధి సేవ 13న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం 14న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీ«ధి సేవ, బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 7 గంటలకు జరుపుతారు. రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై శ్రీవారి తిరువీధి సేవ 15న రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు. అనంతరం ఉభయ దేవేరులతో వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. 16న రాత్రి 7 గంటల నుంచి శ్రీ స్వామివారి రథోత్సవం క్షేత్ర పురవీధుల్లో నిర్వహిస్తారు. 17న ఉదయం 10.30 గంటల నుంచి శ్రీ చక్రవారి–అపభథోత్సవము, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు, రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజ అవరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం 18న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, రాత్రి 9 గంటలకు శ్రీపుష్పయాగం–పవళింపుసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. క్షేత్ర పురాణ గాథ ఇదీ.. ద్వారకా వుహర్షి తపోఫలితంగా ఉద్భవించిన ఈ క్షేత్రాన్ని ద్వారకా తిరువుల అంటారు. ఇక్కడ స్వÄýæుం వ్యక్తునిగా కొలువ#దీరిన చినవెంకన్న పుట్టలో వెలియడంతో పాదుకలు పుట్టలో ఉన్నాయి. దీంతో శ్రీవారికి పాదపూజలేక పోవడంతో పెద్ద తిరుపతి నుంచి స్వామివారిని తెచ్చి స్వÄýæుం వ్యక్తుని వెనుక ప్రతిష్టించారు. దీంతో ఒకే అంతరాలÄýæుంలో స్వామి ఇద్దరు వుూర్తులుగా కొలువై ఉండటం వల్ల ఏటా వైశాఖ, ఆశ్వÄýæుుజ వూసాలలో తిరుకల్యాణ వుహోత్సవాలు నిర్వహిస్తారు. పెద్ద తిరుపతిలో మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు గానీ, ఇక్కడి మొక్కులు అక్కడ తీర్చుకోకూడదన్న సంప్రదాయం ఉంది. కనువిందు చేసే ఆలయ పరిసరాలు ద్వారకా తిరువుల ఆలÄýæు తూర్పురాజగోపుర ప్రాంతం, సన్డైల్, ఇతర ఉపాలయాలలో గార్డెన్లు భక్తులకు కనువిందు చేస్తాయి. క్షేత్రంలోకి వచ్చే వుుందు 40 అడుగులపైగా ఉన్న గరుడాళ్వార్ విగ్రహం, ఆంజనేÄýæుుని విగ్రహం ఆకర్షిస్తాయి. అదనపు ఆకర్షణగా ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భారీ అన్నమాచార్యుని విగ్రహం నిర్మింప చేశారు. సువూరు 25 లక్షలతో శ్రీవారి ప్రచార రథాన్ని రూపొందించారు. ఇంకా మూడేళ్ల కాలంలో రూ.48.27 కోట్లతో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులు 80 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్షేత్రానికి చేరుకునేదిలా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే వూర్గం గుండా ద్వారకా తిరువులకు 17 కిలో మీటర్లదూరంలో ఉన్న భీవుడోలు రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి అయినా బస్సుల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. భక్తులకు సౌకర్యాలు కల్పనే ధ్యేయం భక్తులకు సౌకర్యాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరిపేందుకు అన్ని చర్యలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ వసతులు ఏర్పాటు చేశాం. ఉత్సవాల రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా చూశాం. –వేండ్ర త్రినాథరావు, ఈవో, శ్రీవారి దేవస్థానం -
రేపటి నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం
∙డోర్నకల్–విజయవాడ–కాజీపేట మార్గంలో పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు ∙ఎక్స్‌ప్రెస్‌లను దారిమళ్లించనున్న అధికారులు డోర్నకల్ / రైల్వే గేట్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒSలో బుధవారం నుంచి ఈనెల 28వ తేదీవరకు రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టం (ఆర్ఆర్ఐ) పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. ఈ మేరకు డోర్నకల్ – విజయవాడ మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లతో పాటు మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దు కానున్న రైళ్లు, ఆయా తేదీల వివరాలిలా ఉన్నాయి. విజయవాడ – కొత్తగూడెం ప్యాసింజర్(57254) ఈనెల 21 నుండి 28 వరకు, కొత్తగూడెం – విజయవాడ ప్యాసింజర్(57253) 21 నుండి 28వ తేదీ వరకు, కాజీపేట–విజయవాడ పుష్పుల్(57237) 21 నుండి 26వ తేదీ వరకు, డోర్నకల్ – విజయవాడ వెళ్లే ప్యాసింజర్(67251) 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు, విజ యవాడ – కాజీపేటకు వెళ్లే పుష్పుల్ రైలు(57238) 21 నుండి 27వ తేదీ వరకు, విజయవాడ–మహబూబాబాద్ పెద్దపల్లి ప్యాసింజర్(77253) 21, 24, 28వ తేదీ ల్లో, మహబూబాబాద్–విజయవాడ పెద్దపల్లి ప్యాసింజర్(77254) 23, 27వ తేదీ ల్లో, విజయవాడ–డోర్నకల్ ప్యాసింజర్(67272) 21 నుండి 27వ తేదీ వరకు రద్దుకానుంది. అలాగే, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22, 23, 24 తేదీల్లో సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకే నడపనుండగా 25వ తేదీన పూర్తిగా రద్దు చేస్తా రు. ఇక ఇంటర్సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను నడికుడి మీదుగా, షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 20, 22, 25వ తేదీల్లో డోర్నకల్, ఖమ్మం మీదుగా రాయ¯ŒSపాడు బైపాస్ నుండి కాకినాడకు, కాకినాడ – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను 21, 24, 26వ తేదీల్లో రాయ¯ŒSపాడు బైపాస్ మీదు గా డోర్నకల్, వరంగల్ నుండి షిర్డీకి నడపనున్నారు.అలాగే, లింక్ఎక్స్ప్రెస్, మచి లీపట్నం, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను ఇదే మా ర్గంలో విజయవాడ స్టేష¯ŒSకు వెళ్లకుండా రాయ¯ŒSపాడు బైపాస్ మీదుగా నడపనున్నారు. అంతేకాకుండాగోదావరిఎక్స్ప్రెస్, గౌతమి, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, ఏపీ, స్వర్ణజయంతి మొదలైన రైళ్లు విజయవాడ వర కు వెళ్లకుండా కొండపల్లి గుణదల రైల్వేస్టే ష¯ŒS నుంచి వైజాగ్ వెళ్లనున్నాయి. చైన్నై వైపు వెళ్లే రైళ్లు సంఘమిత్ర, గోరఖ్‌పూర్, గరీబ్‌రథ్, దర్బంగా, నవజీవ¯ŒS, గంగాకావేరి, జనతా, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు సంపర్క్‌క్రాంతి రైళ్లు వయా కాజీపేట నుం చి కాచిగూడ మీదుగా చెన్నై వైపు వెళ్తాయ ని అధికారులు చెప్పారు. ఇక కృష్ణా, ఇంటర్సిటీ రైళ్లు సికంద్రాబాద్ నుంచి నడికుడ మీదుగా గుంటూరు వైపు వెళతాయి. -
గోవుల పోటీలకు పటిష్ట ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: రాష్ట్రస్థాయి గోవుల పాల, అందాల పోటీల నిర్వహణకు స్థానిక మార్కెట్ యార్డును ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పోటీల్లో పాల్గొనే పలు జాతిగోవులు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. జిల్లా పశు సంవర్ధకశాఖ ఏలూరు డివిజన్ ఏడీ ఎస్టీజీ సత్యగోవింద్, అధికారులు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పాలపోటీలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభిస్తారని, కలెక్టర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పాల పోటీల రిజిస్ట్రేషన్‌తో ప్రారంభం అవుతుందన్నారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు పశువుల పొదుగులను ఖాళీ చేస్తారన్నారు. 16 ఉదయం, సాయంత్రం అలాగే 17న ఉదయం మూడుపూటలా పాల ఉత్పత్తిని సేకరిస్తామని చెప్పారు. అదేవిధంగా 17న ఉదయం 8 గంటల నుంచి అందాల పోటీలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోటీలు ప్రారంభిస్తామన్నారు. పోటీల్లో విజేతలకు 17న సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని చెప్పారు. 200 గోవులు వస్తాయని అంచనా పాల పోటీలకు 100, అందాల పోటీలకు మరో 100 గోవులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గోవులు వాతావరణ మార్పు కారణంగా పాల దిగుబడి తగ్గుతుందన్న ఉద్దేశంతో వాతావరణం అలవాటయ్యేందుకు గాను పలువురు రైతులు ముందుగానే గోవులతో ఇక్కడకు చేరుకున్నారు. గోవులకు దాణా, వసతులను అధికారులు కల్పిస్తున్నారు. బహుమతులు ఇలా.. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ రూ.5 లక్షలు, పశుసంవర్ధకశాఖ రూ.2 లక్షల నిధులతో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. అందాల పోటీల్లో విజేతలకూ బహుమతులు అందిస్తామని చెప్పారు.