బ్రహ్మాండ నాయకునికి.. బ్రహ్మోత్సవ శోభ | VENKANNA BRAMOSTAVALU | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ నాయకునికి.. బ్రహ్మోత్సవ శోభ

Published Sun, Oct 9 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

బ్రహ్మాండ నాయకునికి.. బ్రహ్మోత్సవ శోభ

బ్రహ్మాండ నాయకునికి.. బ్రహ్మోత్సవ శోభ

 ద్వారకా తిరుమల :అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని చాటే.. బ్రహ్మోత్సవాలు చిన్న తిరుపతి క్షేత్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా, జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచినదిగా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తూ.. తరిస్తున్నారు. వైఖానస ఆగవూన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి తిరు కల్యాణ వుహోత్సవాలు వైభవోపేతంగా ఏటా రెండుసార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 11 నుంచి 18 వరకు జరిగే ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవ విశేషాలివీ.. 
ఉత్సవాలకు శ్రీకారం ఇలా.. 
ఈనెల 11న ఉదయం 10 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది. 
12న సాయంత్రం 6 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై శ్రీవారి తిరువీధి సేవ
13న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
14న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీ«ధి సేవ, బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 7 గంటలకు జరుపుతారు. రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై శ్రీవారి తిరువీధి సేవ 
15న రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు. అనంతరం ఉభయ దేవేరులతో వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. 
16న రాత్రి 7 గంటల నుంచి శ్రీ స్వామివారి రథోత్సవం క్షేత్ర పురవీధుల్లో నిర్వహిస్తారు. 
17న ఉదయం 10.30 గంటల నుంచి శ్రీ చక్రవారి–అపభథోత్సవము, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు, రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజ అవరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం
18న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, రాత్రి 9 గంటలకు శ్రీపుష్పయాగం–పవళింపుసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 
క్షేత్ర పురాణ గాథ ఇదీ.. 
ద్వారకా వుహర్షి తపోఫలితంగా ఉద్భవించిన ఈ క్షేత్రాన్ని ద్వారకా తిరువుల అంటారు. ఇక్కడ స్వÄýæుం వ్యక్తునిగా కొలువ#దీరిన చినవెంకన్న పుట్టలో వెలియడంతో పాదుకలు పుట్టలో ఉన్నాయి. దీంతో శ్రీవారికి పాదపూజలేక పోవడంతో పెద్ద తిరుపతి నుంచి స్వామివారిని తెచ్చి స్వÄýæుం వ్యక్తుని వెనుక ప్రతిష్టించారు. దీంతో ఒకే అంతరాలÄýæుంలో స్వామి ఇద్దరు వుూర్తులుగా కొలువై ఉండటం వల్ల ఏటా వైశాఖ, ఆశ్వÄýæుుజ వూసాలలో తిరుకల్యాణ వుహోత్సవాలు నిర్వహిస్తారు. పెద్ద తిరుపతిలో మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు గానీ, ఇక్కడి మొక్కులు అక్కడ తీర్చుకోకూడదన్న సంప్రదాయం ఉంది. 
కనువిందు చేసే ఆలయ పరిసరాలు 
ద్వారకా తిరువుల ఆలÄýæు తూర్పురాజగోపుర ప్రాంతం, సన్‌డైల్, ఇతర ఉపాలయాలలో గార్డెన్లు భక్తులకు కనువిందు చేస్తాయి. క్షేత్రంలోకి వచ్చే వుుందు 40 అడుగులపైగా ఉన్న గరుడాళ్వార్‌ విగ్రహం, ఆంజనేÄýæుుని విగ్రహం ఆకర్షిస్తాయి. అదనపు ఆకర్షణగా ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భారీ అన్నమాచార్యుని విగ్రహం నిర్మింప చేశారు. సువూరు 25 లక్షలతో శ్రీవారి ప్రచార రథాన్ని రూపొందించారు. ఇంకా మూడేళ్ల కాలంలో రూ.48.27 కోట్లతో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులు 80 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
క్షేత్రానికి చేరుకునేదిలా.. 
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే వూర్గం గుండా ద్వారకా తిరువులకు 17 కిలో మీటర్లదూరంలో ఉన్న భీవుడోలు రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి అయినా బస్సుల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.
 
భక్తులకు సౌకర్యాలు కల్పనే ధ్యేయం 
భక్తులకు సౌకర్యాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరిపేందుకు అన్ని చర్యలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ వసతులు ఏర్పాటు చేశాం. ఉత్సవాల రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా చూశాం. 
–వేండ్ర త్రినాథరావు, ఈవో, శ్రీవారి దేవస్థానం 
 
 

Advertisement
Advertisement