రాజానగరం (తూర్పు గోదావరి) : జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి- విశాఖపట్నం మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద నీటిని దాటలేక కార్లు, ద్విచక్రవాహనాలు నీటి మధ్యన నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.