national highway 16
-
విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..!
కోల్‌కతా: రోడ్డుపై బస్సు కోసం 10 ఏళ్ల పాపతో ఓ మహిళ వేచి చూస్తోంది. సమయానికి బస్సు రాకపోగా.. అంబులెన్స్ రూపంలో అబులెన్స్ దూసుకొచ్చి తల్లీకూతుళ్లను అనంతలోకాలకు చేర్చింది. ప్రాణాలు కాపాడే అంబులెన్సే ఇరువురి పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో శనివారం జరిగింది. నిర్లక్ష్యపూరితంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు పోయేందుకు అంబులెన్స్ కారణమైన క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో కోల్‌కతా-చెన్నైని కలిపే జాతీయ రహదారి 16పై సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం తెల్లవారుజామున 6.30 ప్రాంతంలో బాధితులు బస్సు కోసం వేచి చూస్తున్నారని, కోలఘాట్ వైపు వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేరని వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టటం వల్ల తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అంబులైన్స్‌కు నిప్పుపెట్టారు. సుమారు 5 గంటల పాటు నిరసనలు చేపట్టటంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను మధ్యాహ్నానికి శాంతిపంజేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా -
బండరాయిని ఢీకొన్న కారు
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కట్టా శ్రీనివాసులు (30), ముందు సీట్లో కూర్చున్న దొమ్మేటి పవన్‌కుమార్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న గుత్తుల బాలు, దొమ్మేటి వెంకటేష్ గాయపడ్డారు. మృతులు శ్రీనివాసులుది జిల్లాలోని అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం. పవన్‌కుమార్‌ది అంబాజీపేట. గాయపడిన ఇద్దరిలో దొమ్మేటి వెంకటేష్‌ది అంబాజీపేట కాగా, గుత్తుల బాలుది విశాఖ జిల్లా గాజువాక. శనివారం రాత్రి కాకినాడలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరైన ఈ నలుగురూ కారులో విశాఖపట్నం బయలుదేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అన్నవరంలోని మండపం జంక్షన్ ముందున్న వై జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఖాళీస్థలంలో ఉన్న పెద్ద బండరాయిని బలంగా ఢీకొంది. అనంతరం రెండు పల్టీలు కొట్టి, పది మీటర్ల అవతల రోడ్డు మీద బోల్తా పడింది. మృతి చెందిన, గాయపడిన నలుగురూ 30–35 మధ్య వయసు వారే. కోనసీమలో పుట్టిన వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమండ్రి-విశాఖ మధ్య రాకపోకలకు అంతరాయం
రాజానగరం (తూర్పు గోదావరి) : జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి- విశాఖపట్నం మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద నీటిని దాటలేక కార్లు, ద్విచక్రవాహనాలు నీటి మధ్యన నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కారు బోల్తా... వ్యక్తి మృతి
మనుబోలు: ప్రమాదవశాత్తూ కారు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో మనుబోలు-గూడురు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మునుబోలు - గూడురు మార్గంలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. కాగా, మృతుడిని గూడురుకు చెందిన చేరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి (40)గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.