
బుట్ట బొమ్మలకు బుట్టలకొద్ది అందాన్ని జత చే యడానికే అన్నట్టు ఇప్పుడు మెడ వంపుల్లోనూ బుట్టలు చేరాయి.హృదయానికి అలంకారంగా అమరాయి.
చెవులకు ఎన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్న బుట్టలదే ఇప్పటికీ అగ్రస్థానం. అందుకే బుట్టలు బంగారంతోనే కాదు ఫ్యాషన్ జువెల్రీలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. హారాలుగా అందాన్ని పెంచాయి.
►ఒక బుట్టతో హారాలు వచ్చాయి. అవి బంగారంలోనూ, ఇమిటేషన్ జువెల్రీలోనూ రూపుకట్టాయి.
►ఇప్పుడు సిల్వర్, థ్రెడ్.. ఫ్యాషన్ జువెల్రీలోనూ బుట్టల హంగులు కొత్తగా చేరాయి.
►చిన్న చిన్న పూసలు అవి ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లోవి ఎంచుకొని హారంగా గుచ్చాలి. వాటికి బ్రాస్, సిల్వర్ బుట్టలను మధ్య మధ్యలో జత చేయాలి.
►పూసలు, కుందన్స్‌తో హారాలు చేయించుకుంటే వాటి రంగుతో పోలి ఉండే బుట్టల లాకెట్‌ను జత చేస్తే చాలు. హారానికి ఫలితంగా ధరించినవారి అందం రెట్టింపు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment