kundans
-
బుట్ట బొమ్మలకు హారాలు
బుట్ట బొమ్మలకు బుట్టలకొద్ది అందాన్ని జత చే యడానికే అన్నట్టు ఇప్పుడు మెడ వంపుల్లోనూ బుట్టలు చేరాయి.హృదయానికి అలంకారంగా అమరాయి. చెవులకు ఎన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్న బుట్టలదే ఇప్పటికీ అగ్రస్థానం. అందుకే బుట్టలు బంగారంతోనే కాదు ఫ్యాషన్ జువెల్రీలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. హారాలుగా అందాన్ని పెంచాయి. ►ఒక బుట్టతో హారాలు వచ్చాయి. అవి బంగారంలోనూ, ఇమిటేషన్ జువెల్రీలోనూ రూపుకట్టాయి. ►ఇప్పుడు సిల్వర్, థ్రెడ్.. ఫ్యాషన్ జువెల్రీలోనూ బుట్టల హంగులు కొత్తగా చేరాయి. ►చిన్న చిన్న పూసలు అవి ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లోవి ఎంచుకొని హారంగా గుచ్చాలి. వాటికి బ్రాస్, సిల్వర్ బుట్టలను మధ్య మధ్యలో జత చేయాలి. ►పూసలు, కుందన్స్‌తో హారాలు చేయించుకుంటే వాటి రంగుతో పోలి ఉండే బుట్టల లాకెట్‌ను జత చేస్తే చాలు. హారానికి ఫలితంగా ధరించినవారి అందం రెట్టింపు అవుతుంది. -
వేలి కొసల్లో మెరుపు
పార్టీకి వెళ్లడానికి మేకప్, డిజైనర్ దుస్తులు అన్నీ చక్కగా అమరాయి. మరి హ్యాండ్ బ్యాగ్?! అది కూడా చూడముచ్చటగా ఉండాలి... అని ఆలోచించేవారి మనసును ఇట్టే దోచేసే డిజైనర్ బ్యాగ్స్ ఇవి. వేళ్లతో ముచ్చటగా పట్టుకోవడానికి వీలుగా ఉండే వీటిని చిన్న పర్సులుగా కూడా వాడచ్చు. బ్లాక్ బ్రాస్ మెటీరియల్‌తో రూపొందించి, 24 క్యారెట్ల బంగారంతో కోటింగ్ ఇచ్చారు. చుట్టూ మువ్వలు, కుందన్స్, స్టోన్స్‌తో మరిన్ని హంగులను పొదిగారు. సంప్రదాయ దుస్తులకు చక్కగా అమరే ఈ బుజ్జి హ్యాండ్‌బ్యాగ్‌లో సెల్‌ఫోన్, డబ్బులూ పెట్టుకోవడానికి వీలుగా లోపల సిల్క్ క్లాత్‌ను పర్సగా ఉపయోగించారు. కలకత్తాలోని సంప్రదాయ ఆభరణాల సంస్థ ‘క్రితి’ వీటిని రూపొందించింది. ఇటీవల హైదరాబాద్ ఫ్యాషన్ ఎక్స్‌పోలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక్కో బ్యాగ్ ధర: రూ.5000/- - కవిత ఫుంభర, డిజైనర్ www.facebook.com/kriti.jewelry