దాతలు విరాళంగా అందచేసిన హారం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విలువైన బంగారు డైమండ్ కంఠాభరణాన్ని శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మయ్య దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ ఈవో భ్రమరాంబ, ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్‌లకు డైమండ్ హారాన్ని అందచేశారు. దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు, పాలక మండలి సభ్యురాలు కటకం శ్రీదేవి అమ్మవారి చిత్రపటం, ప్రపాదం, శేషవస్త్రాలను అందజేశారు.
ఈవోకు బంగారు హారాన్ని అందచేస్తున్న దాతలు
Comments
Please login to add a commentAdd a comment