vidhya nagar
-
సీఎం కేసీఆర్ దత్త పుత్రిక నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూష త్వరలో ఓ ఇంటి కోడలుగా వెళ్లబోతున్నారు. రాంనగర్ ప్రాంతానికి చెందిన మమత, మర్ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను విద్యానగర్‌లోని హోటల్లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుణు చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులు మహిళా శిశు సంక్షేమ శాఖ చూస్తోంది.ఈ ఐదేళ్లలో ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఉన్నత చదువులు చదివిన ప్రత్యూష.. నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌రెడ్డి.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పింది.దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా.. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: రూ.5 వేల కోట్ల నష్టం.. దీంతో సీఎం కేసీఆర్ ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలను తెలుసుకున్న సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డి.దివ్యకు సూచించారు. కమిషనర్ డీ దివ్య ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. తన పెళ్లికి కచ్చితంగా వస్తానని కేసీఆర్ చెప్పారని, ఆయన అండతో కోలుకున్నానని ప్రత్యూష తెలిపారు. పెళ్లి చేసుకొని మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. -
18% లేదా ఆ లోపే!
ముంబై: 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాని మోదీ మంగళవారం చెప్పారు. జీఎస్టీని అమల్లోకి తీసుకురాకముందు దేశంలో పన్ను కట్టే వాణిజ్య సంస్థలు 65 లక్షలు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు ఆ సంఖ్య మరో 55 లక్షలు పెరిగిందన్నారు. ముంబైలో జరిగిన ‘రిపబ్లిక్ సమిట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘ఈరోజు జీఎస్టీ పరిధి చాలా పెద్దగా ఉంది. కోటికి పైగా కంపెనీలు ఈ పన్ను వ్యవస్థ కింద నమోదై ఉన్నాయి. 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ పన్ను పరిధిలోకి తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. విలాసాలకు వినియోగించే అతి కొన్ని వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తాం’ అని అన్నారు. నిత్యం చర్చల ద్వారా జీఎస్టీని మెరుగుపరుస్తున్నామనీ, జీఎస్టీ విధానాలను మరింత సరళీకరించి వాణిజ్య సంస్థలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.. వారికి శిక్ష .. ఎవరూ అనుకోలేదు 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషులకు శిక్ష పడుతుందని ఎవరూ ఊహించలేదని మోదీ అన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం జీవిత ఖైదు విధించడం తెలిసిందే. ‘సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం దక్కుతుందనీ, కాంగ్రెస్ నేతలకు శిక్ష పడుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరూ అనుకోలేదు’ అని మోదీ పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి ఓ అవినీతి అంశం (రఫేల్ యుద్ధ విమానాలు) సుప్రీంకోర్టు వరకు వెళ్లిందనీ, తాము అంతా సక్రమంగానే చేసినట్లు కోర్టు నిర్ధారించిందని చెప్పారు. 41 వేల కోట్ల పనులకు శంకుస్థాపన మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మొత్తం రూ. 41 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ. 33 వేల కోట్లతో ముంబై మహానగరంలో ఇళ్ల సముదాయాలు, రెండు మెట్రో రైల్ లైన్లను నిర్మించనున్నారు. ముంబై శివారులోని కళ్యాణ్‌లో రూ. 18 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. కళ్యాణ్‌లో మోదీ మాట్లాడుతూ గత కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆదర్శ్ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఆదర్శ్ పథకం కింద పేదల కోసం కట్టిన ఇళ్ల కేటాయింపులో భారీ కుంభకోణం చోటు చేసుకోవడం తెలిసిందే. తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లా కాకుండా నిజంగా ఆదర్శ సమాజాన్ని ఇళ్ల పథకాల ద్వారా నిర్మిస్తోందని మోదీ అన్నారు. సభ కోసం శ్మశానం బంద్ కళ్యాణ్ ప్రాంతంలో మంగళవారం మోదీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భద్రత కల్పించడంలో భాగంగా వేదికకు 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానాన్ని పోలీసులు మూసేయించారు. ఖననం/దహనం చేసేందుకు మృతదేహాలను మరో శ్మశానానికి పంపారు. అలాగే మోదీ సభా వేదిక పరిసరాల్లోని మూడు పెళ్లిళ్లు రద్దయినట్లు ఓ అధికారి చెప్పారు. బాలీవుడ్ ప్రముఖులతో మోదీ భేటీ భారత చలనచిత్ర రంగ సమస్యలపై చర్చించేందుకు బాలీవుడ్ ప్రముఖులు మోదీని మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కలిశారు. సినీ దర్శకుల సమాఖ్య అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి, నిర్మాతలు రితేశ్ సిధ్వానీ, కరణ్ జోహార్, నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు మోదీని కలిసిన బృందంలో ఉన్నారు. దూరంగా శివసేన.. ప్రధాని మోదీ కార్యక్రమాలకు బీజేపీ మిత్రపక్షం, మహారాష్ట్రలో ప్రధాన పార్టీ శివసేన దూరంగా ఉంది. శివసేన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను మోదీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదనీ, కాబట్టి శివసేన మంత్రులు, నేతలెవరూ ఆ కార్యక్రమాలకు వెళ్లకూడదని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు ఉండటం తెలిసిందే. ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకావిష్కరణ ప్రముఖ దివంగత వ్యంగ్య చిత్రకారుడు, ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ జీవితంపై రాసిన ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకాన్ని మోదీ ముంబైలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవిస్ పాల్గొన్నారు. ‘కార్టూన్ల ద్వారా గత నాలుగైదు దశాబ్దాల చరిత్రపై పరిశోధన చేయగల విశ్వవిద్యాలయం ఏదైనా ఉందేమో చూడాలని ఫడ్నవిస్‌ను నేను కోరుతున్నా. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు. కోట్లాది ప్రజలను, వారి హృదయాలను కలిపి ఉంచిన మూలాధారం వంటి వారు లక్ష్మణ్. సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనకు లక్ష్మణ్ కార్టూన్లే సులువైన మార్గం’ అని అన్నారు. -
స్వామి స్థలం సగం ధరకేనా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మంగళగిరి లక్ష్మీనరసింహ దేవస్థానానికి చెందిన స్థలాల అమ్మకాల్లో వీజీ టీఎం ఉడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గుంటూరు విద్యానగర్‌లో మిగిలిన స్థలాలను టెండరు కమ్ ఆక్షన్ విధానంలో విక్రయించాలని తీసుకున్న నిర్ణయంలో దేవాదాయ శాఖను విస్మరించింది. ఆప్సెట్ ధర నిర్ణయం, దినపత్రికలో నోటిఫికేషన్ ఇవ్వడం వంటి ముఖ్య విషయాలను దేవాదాయశాఖకు తెలియపరచకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. స్వామి వారికి చెందిన 8.25 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి విక్రయిం చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉడా, గత ఏడాది స్థలాలను విక్రయించ గా వచ్చిన నగదును దేవాదాయ శాఖకు జమ చేసింది. తొలి విడత స్థలాల అమ్మకాలు రాష్ట్ర విభజనకు ముందు జరిగాయి. అప్పట్లో బహిరంగ మార్కెట్ కంటే ఆక్షన్‌లోనే తక్కువ రేటు పలికాయనే విమర్శలు వినపడ్డాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థలాలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ స్థలాలకు ఆప్సెట్ ధర తక్కువగా నిర్ణయిస్తూ దినపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.గుంటూరు విద్యానగర్‌లో స్వామివారికి చెందిన ప్లాట్లలో 7 మిగిలి పోయాయి. ఇవన్నీ 2000 చదరపు గజాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. వీటిని ఈ నెల 11న గుంటూరులోని ఉడా కార్యాలయంలో విక్రయించ డానికి టెండరు కమ్ ఆక్షన్ నిర్వహించనున్నారు.ఆసక్తిగల పార్టీలు దరఖాస్తులు తీసుకుని అదే రోజు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనాలని మంగళవారం దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే చదరపు గజానికి నిర్ణయించిన ఆప్సెట్ ధరపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు ఉడా ఈ నిర్ణయాన్ని దేవాదాయశాఖకు తెలియపరచకుం డానే దినపత్రికకు నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఆ శాఖ ఉద్యోగులంతా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యానగర్‌లో బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.50,000లకు పైగా ఉంది. అప్సెట్ ధరను రూ.23,000గానే దినపత్రికలో పేర్కొనడంతో స్వామివారి ఆదాయం పడిపోతుందని భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా, దక్షిణ ముఖం కలిగిన స్థలాలు కావడంతో పాటు వాస్తుపరంగా స్వల్ప లోపాలు ఉన్నాయని చెప్పారు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ లోపాలు సరిచేసుకోవడానికి కొంత స్థలాన్ని వదులుకోవాల్సి ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఆప్సెట్ ధర తక్కువగా నిర్ణయించామని చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో దేవాదాయశాఖకు ముందస్తుగా తెలియపరచకపోయినా, తుదిగా వాటిని ఖరారు చేసే అధికారం ఆ శాఖకే ఉందన్నారు. వారు ఆశించిన స్థాయిలో స్థలాలకు రేటు రాలేదని దేవాదాయశాఖ కమిషనర్ భావిస్తే టెండర్లు రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతీసారీ దేవాదాయశాఖకు తెలియచేయాల్సిన అవసరం లేదనే భావనలో ఉడా అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు. -
జల గండం
కొత్తపేట(గుంటూరు): జిల్లాలో జల గండం పొంచి ఉంది. భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటి పోవడమే ఇందుకు కారణం. తీవ్ర వర్షాభావం కారణంగా కుంటలు, చెరువులు ఎండిపోవటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయూరైందని నిపుణులు చెబుతున్నారు. పల్నాడు ప్రాంతంతోపాటు గుంటూరు నగరంలోనూ భూగర్భ జల మట్టం బాగా పడిపోరుుంది. గత నెలలో జిల్లా సగటు భూగర్భ జల మట్టం -6.663 మీటర్లుగా నమోదైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం, అశాస్త్రీయ పట్టణీకరణ ఈ సమస్యకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.పల్నాడు ప్రాంతంలోని దుర్గి, వె ల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలాల్లో 300 మీటర్ల లోతు వరకు వెళ్లినా నీటి జాడ కనిపించడం లేదు. గుంటూరులోని గుజ్జనగుండ్ల, చంద్రమౌళినగర్, విద్యానగర్, లక్ష్మీపురం, కొరిటెపాడు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లోని భారీ అపార్ట్మెంట్లలో 600 నుంచి వెరుు్య అడుగుల లోతు వరకు బోర్లు తవ్వటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా తయూరైంది. ఇవీ లెక్కలు జిల్లాలోని భూగర్భ జల మట్టాలను అధికారులు నెలకొకసారి 125 పిజోమీటర్ల ద్వారా పరిశీలించి వివరాలు నమోదు చేస్తుంటారు. వీటి ప్రకారం ఈ ఏడాది మే నెలలో తెనాలి డివిజన్లో 4.59 మీటర్లు, నరసరావుపేట డివిజన్లో 6.45 మీటర్లు, గుంటూరు డివిజన్లో 14.59 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నారుు. 2012లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం -6.910 మీటర్లు కాగా 2013లో-7.838 మీటర్లు, ఈ ఏడాది జూన్ నాటికి -6.663 మీటర్లుగా నమోదైంది. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి... పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అపార్లమెంట్లలో భారీ బోర్ల తవ్వకాన్ని నిరోధించాలని, ఇంకుడు గుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేయూలని పేర్కొంటున్నారు. -
పావగడలో దొంగల బీభత్సం
పావగడ, న్యూస్‌లైన్ : పావగడలో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో అలంకార థియేటర్ ఎదురుగా ఉన్న విద్యానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని హెల్త్ అసిస్టెంట్ రవిచంద్ర కుమార్ ఇంట్లోకి జొరబడి సుమారు రూ.3.60 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రవిచంద్రకుమార్, భార్య నాగకీర్తి, అతని తల్లి గంగమ్మ, పదేళ్లలోపున్న కుమారులు ప్రణబ్, ప్రణీత్ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు గేటు తాళాలు పగులగొట్టి కాంపౌండ్ లోపలకు వచ్చి, మెయిన్ డోర్‌కున్న లాక్‌ను బండరాయితో ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు మేల్కొనే సరికే డ్రాయర్లతో ఉన్న ముగ్గురు లోపలకు వచ్చేశారు. ‘మీకు ఎలాంటి హాని తలపెట్టం.. బంగారు నగలు, డబ్బు ఇవ్వండి’ అంటూ కత్తితో బెదిరించారు. ప్రాణ భయంతో రవిచంద్ర కుమార్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వగా, అతని భార్య తన ఒంటిపై ఉన్న బంగారు నగలను ఇచ్చేసింది. తర్వాత గంగమ్మ మెడలోని మాంగల్యం సరం, ముత్యాల సరం, చెవిలో కమ్మల్ని దుండగులు కాజేశారు. వారిని ఒక గదిలో బంధించి, డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో వెదుకుతుండగా, గంగమ్మ కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సీఐ భానుప్రసాద్, ఎస్ఐ అశోక్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల భారీగా గాలించారు. తుమకూరు నుంచి జాగిలాలను రప్పించగా, అవి ఇంటి నుంచి కొంతదూరం పట్టణం వైపు వెళ్లి తిరిగొచ్చేశాయి. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. కాగా దోపిడీ దొంగలు 25.-30 ఏళ్ల లోపు ఉన్న వారేనని, వారు అచ్చ తెలుగులో మాట్లాడారని, ఇంటి బయట కూడా మరో దొంగ కాపలా ఉన్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. ఏఎస్పీ లక్ష్మణ్, మధుగిరి సబ్ డివిజన్ డీఎస్పీ గురుస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులు దొంగల రూపురేఖలను చెప్పిన మేరకు వారి ఊహా చిత్రాలను పోలీసులు రూపొందించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రసాద్ తెలిపారు. -
జగిత్యాలలో భారీ చోరీ
జగిత్యాల అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని విద్యానగర్‌లో రెండిళ్లలో ఏకకాలంలో దొంగలు పడ్డారు. సుమారు 11 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.50 వేలు దోచుకెళ్లారు. విద్యానగర్‌కు చెందిన కందుకూరి గంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సోమవారం సాయంత్రం గంగారెడ్డి అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఇంటికి తాళమేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లిచూడగా.. బీరువాలోని 8 తులాల బంగారు గొలుసు, నెక్లెస్, ముత్యాలహారం, మాటిలతోపాటు రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన గోపు రాజన్న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని 80 తులాల వెండి, 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు బోరుమన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గంగారెడ్డి, రాజన్న ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. జగిత్యాలలో ఇటీవల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న క్రమంలో ఇకేసారి రెండిళ్లలో చోరీలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. -
రయ్.. గయ్..!
‘గుడు.. గుడు’ చప్పుడు విన్పిస్తే గుండె ఆగినంత పనవుతోంది. వెనుక వైపు నుంచి బైక్ ఏమాత్రం వేగంగా వచ్చినా అదిరిపడే పరి స్థితి. వీధిచివరన ఒకరి కన్నా ఎక్కువ మంది యువకులు మాట్లాడుకుం టున్నా.. అడుగు ధైర్యంగా ముందుకేయలేని దుస్థితి. కనీసం బంగారు తాళితో బయటకెళ్లినా అతివకు రక్షణ కరువైంది. బండిమీద రయ్.. అని వచ్చి.. చైన్లు లాక్కుని జుయ్ అని దూసుకెళ్తున్నారు దొంగలు. -న్యూస్‌లైన్, కరీంనగర్ క్రైం సమయం రాత్రి 8 గంటలు: సిరిసిల్లలోని గాంధీనగర్‌లో నడుస్తూ వెళ్తున్నారు కందూకూరి అనందం-విజయలక్ష్మి దంపతులు. ఖరీదైన బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు విజయలక్ష్మి మెడలోని 12 తులాల బంగారు నగలను లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. సమయం సాయంత్రం 5 గంటలు: కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఓ ఉద్యోగిని ఇం టికి వెళ్తోంది. వీధి చివర పల్సర్‌బైక్‌పై నీట్‌గా త యారైన ఇద్దరు యువకులు కబర్లు చెప్పుకుంటున్నారు. కాసేపటికే బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారం చైక్ లాక్కుపోయారు. సమయం ఉదయం 7గంటలు: కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన మహిళ గుడికి వెళ్తోంది. వీధి మలుపు తిరిగిందో లేదో.. బైక్‌పై రయ్యని దూసుకొచ్చిన ఇద్దరు లిప్తపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు నొక్కేశారు. వారం వ్యవధిలో వీటితోపాటు10 చోరీలు జరిగాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో చోరులు రెచ్చిపోతున్నారు. రెప్పపాటులో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఖరీదైన బైకులు వాడుతూ పెద్దింటి బిడ్డల్లా నమ్మిస్తున్నారు. అనుమానం రాకుండా వెంబడించి సొత్తుతో మాయమవుతున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే దాడులకూ తెగబడుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్సేం కాదు. దొంగల్లో ఉన్నత విద్యావంతులూ ఉండడం కలవరపరుస్తోంది. జల్సాల కోసం.. కొంతకాలం క్రితం పోలీసులు కొందరు దొంగలను అరెస్టు చేశారు. వీరంతా ఇంజినీరింగ్ విద్యార్థులే అని తెలిసి ఆశ్చర్యపోయారు. చాలామంది ఖరీదైన బైక్‌లపై వచ్చి చోరీలు చేస్తున్నారు. ఇందులో జల్సాలకు అలవాటుపడినవారే అధికం. జిల్లాలో సుమారు 120 మందిదాక దొంగలు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది 22 -28 ఏళ్లలోపువారే. బంగారం ధర బాగా పెరగడంతో నగల చోరీపై దృష్టిసారించారు. సులభంగా అమ్ముతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు పొందుతున్నారు. నగలతో సంచరించే మహిళలపై నజర్ వేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం అనుమానం రాకుండా ఆహార్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనావాసాల్లో, జనసమ్మర్థ ప్రాంతాల్లోనూ సులువుగా పనికానిచ్చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీస్ నిఘా జాడేది? ఇటీవల పోలీస్ నిఘా కొరవడింది. మూడు నెలల్లో జరిగిన భారీ చోరీలే దీనికి తార్కాణం. నగరంలాంటి ప్రాంతాల్లో బ్లూకోట్, ఇంటెలిజె న్స్, స్పెషల్‌బ్రాంచ్, ఐడీ పార్టీ పోలీసులు జనాల్లో తిరుగుతుంటారు. గ్రామాల్లో వీపీవోల ను ఏర్పాటు చేశారు. ఇవేవీ దొంగలకు చెక్ చె ప్పడం లేదు. ఘటన జరిగాక వివరాల సేకరణలోనూ వెనకంజే కన్పిస్తోంది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసినా ఘటన స్థలానికి పోలీసులు వెళ్లని సందర్భాలున్నాయి. మరికొన్ని చోట్ల ఫి ర్యాదు స్వీకరించినా చాలారోజుల దాక కేసులు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ నిర్లక్ష్యం దొంగలకు అయాచిత వరం అవుతోంది. రికవరీలోనూ చేతివాటం అదృష్టం బాగుండి దొంగలు దొరికితే.. సొత్తు రికవరీలోనూ పోలీసులు చేతివాటం చూపుతున్నారు. పూర్తిస్థాయిలో రికవరీ అయినా సొత్తును బాధితులకు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. లేకపోతే కల్తీ బంగారం కట్టబెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఠాణా నుంచి బాధితుడికి కోర్టు ద్వారా సుమారు 36 గ్రాముల బంగారం రికవరీ చేశారు. తీరా దాన్ని పరిశీలిస్తే 14 గ్రాములు రాగి కలిపారు.